అన్వేషించండి

Vedaa Teaser: హై యాక్షన్‌లో జాన్ అబ్రహం, అమాయక పాత్రలో తమన్నా- ఆకట్టుకుంటున్న ‘వేదా‘ టీజర్

జాన్ అబ్రహాం, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేదా‘. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు.

Vedaa Movie Teaser Out: బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వేదా‘. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో శార్వరీ వాఘ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నది. తమన్నా భాటియా, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్‌ అబ్రహాం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 12న విడుదలకు రెడీ అవుతోంది.   

ఆకట్టుకుంటున్న ‘వేదా’ టీజర్

త్వరలో ‘వేదా‘ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో, కళ్లు చెదిరే యాక్టింగ్ తో జాన్ అబ్రహాం, శార్వరీ ఆకట్టుకుంటున్నారు. టీజర్ చూస్తుంటే యాక్షన్ ప్రియులను ఓ రేంజిలో అలరించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో జాన్ శార్వరికి గురువుగా నటిస్తున్నారు.

ప్రత్యేక పాత్రలో తమన్నా భాటియా

ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన తమన్నా భాటియా స్పెషల్ రోల్  పోషిస్తోంది. ఇప్పటికే సినిమాలు, ఓటీటీలతో ఫుల్ బిజీ అయిన ఆమె ఈ చిత్రంలో అమాయకురాలిగా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. గత ఏడాది ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జీ కర్దా’ మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇందులో ఆమె చేసిన ఇంటిమేట్ సీన్లు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ సినిమాలో ఓవైపు అమాయకురాలిగా కనిపిస్తూనే హై యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోంది. 'కల్ హో నా హో', 'సలామ్-ఎ-ఇష్క్', 'డి-డే', 'బాట్లా హౌస్' చిత్రాలకు దర్శకత్వం వహించిన అద్వానీ.. ఈ చిత్రంలో తమన్నా సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ తో తనదైన ముద్ర వేసిందని వెల్లడించారు. ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు ఇప్పటికే దర్శకుడు నిఖిల్ వెల్లడించారు. సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబించబోతుందన్నారు.  “తమన్నా నటన చాలా బాగుటుంది. ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేయాలని నేను అడిగినప్పుడు వెంటనే ఓకే చెప్పింది. ఆమె ఈ సినిమాలో ఆమె పాత్ర అద్భుతంగా ఉండబోతోంది” అని వెల్లడించారు.ఇక ఈ సినిమా గురించి మాట్లాడిన తమన్నా “నిఖిల్ కథలు చెప్పే విధానం నాకు చాలా నచ్చుతుంది. అతడి ఆలోచన విధానం సరికొత్తగా ఉంటుంది. జాన్ తో తొలిసారి కలిసి నటిస్తున్నాను. నా పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

అటు 'వేదా' సినిమా కథను అసీమ్ అరోరా అందించారు. జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్, JA ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమన్నా చివరగా రజనీకాంత్ నటించిన ‘జైలర్’, చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భోలా శంకర్’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం  ‘అర్నామనై 4’ అనే తమిళ మూవీతో పాటు బాలీవుడ్‍లో ‘స్త్రీ 2’ మూవీస్ చేస్తోంది.

Read Also: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: లంచం తీసుకుంటూ నర్మదకి దొరికిపోయిన సాగర్! ముగ్ధ బైక్‌ మీద ధీరజ్.. ప్రేమ గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: లంచం తీసుకుంటూ నర్మదకి దొరికిపోయిన సాగర్! ముగ్ధ బైక్‌ మీద ధీరజ్.. ప్రేమ గొడవ!
Brahmamudi Serial Today August 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషుకు మందు తాగించిన లక్కీ – రేఖకు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన నందు  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషుకు మందు తాగించిన లక్కీ – రేఖకు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన నందు  
Karthika Deepam 2 Serial Today August 25th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌కి ముద్దు జ్యో ముద్దు.. కానీ! పెళ్లి బట్టల్లో అదిరిపోయిన జ్యోత్స్న, సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌కి ముద్దు జ్యో ముద్దు.. కానీ! పెళ్లి బట్టల్లో అదిరిపోయిన జ్యోత్స్న, సూరజ్!
Crime Thriller OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - వారణాసి విలన్ కొత్త మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - వారణాసి విలన్ కొత్త మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Out Of Hockey World Cup: అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
Grey Hair : జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget