Chai Wala Teaser: వన్ కేఫ్... వన్ లవ్... వన్ లైఫ్ - రాజీవ్ కనకాల 'చాయ్ వాలా' టీ చాలా స్పెషల్...
Chai Wala: రాజీవ్ కనకాల, శివ కందుకూరి తండ్రీ కొడుకులుగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'చాయ్ వాలా'. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Shiva Kandukuri's Chai Wala Teaser Out: రాజీవ్ కనకాల, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో తండ్రీ కొడుకులుగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ లవ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'చాయ్ వాలా'. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకోగా... తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఓ మధ్య తరగతి ఫ్యామిలీ చుట్టూ సాగే ఎమోషనల్ స్టోరీతో టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించగా... తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని హర్షిక ప్రొడక్షన్ బ్యానర్‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్ నిర్మిస్తున్నారు.
పర్ఫెక్ట్ 'చాయ్ వాలా'
హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్. ఆ చాయ్ కేఫ్ బ్యాక్ డ్రాప్‌లో ఓ ఫ్యామిలీ ఎమోషన్‌ను టీజర్‌లో చూపించారు. రాజీవ్ కనకాల కేఫ్ ఓనర్‌గా కనిపించనుండగా ఆయన కొడుకుగా శివ కందుకూరి నటిస్తున్నారు. 'నా చాప్ విలువ రూ.15. అంతకన్నా ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది.' అనే రాజీవ్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది.
బాధ్యతలున్న ఓ మధ్య తరగతి తండ్రి. చాయ్ వాలాగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఫ్రెండ్స్‌తో సరదాగా తిరిగే కొడుకు. ఆ తర్వాత ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత తన తండ్రి కోసం ఆ యువకుడు ఏం చేశాడు అనేదే స్టోరీ అని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. 'వాడు కేఫ్ చూసుకోకపోయినా ఇక్కడే మాతో ఉంటే చాలురా.' 'ఫస్ట్ టైం పెద్దోడిలా మాట్లాడాడు.' అంటూ రాజీవ్ కనకాల చెప్పే డైలాగ్స్ ఎమోషనల్ తెప్పిస్తున్నాయి. 'నువ్వు మా కోసం... అమ్మ కోసం ఈ కేఫ్ కోసం కష్టపడింది చాలు నాన్నా' అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఓ మధ్య తరగతి తండ్రి చాయ్ వాలా... ఫ్రెండ్స్‌తో సరదాగా తిరిగే ఓ కొడుకు. అతనికి ఓ లవ్ స్టోరీ. మొత్తానికి ఓ ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ స్టోరీని చూడబోతున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.
Also Read: దేశాన్ని కుదిపేసిన సంఘటన, మోదీ మెచ్చిన సినిమా..OTTలో ట్రెండ్ సెట్ చేస్తోంది! డోంట్ మిస్





















