Biker Glimpse : చివరి వరకూ పోరాడిన 'బైకర్' - ఎమోషనల్‌గా శర్వానంద్ స్పోర్ట్స్ డ్రామా గ్లింప్స్
Biker First Glimpse : చార్మింగ్ స్టార్ శర్వానంద్ లేటెస్ట్ యూత్ స్పోర్ట్స్ డ్రామా 'బైకర్' గ్లింప్స్ వచ్చేసింది. ఇదివరకూ ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ లుక్‌లో శర్వా అదరగొట్టారు.

Sharwanand's Biker First Glimpse Out : టాలీవుడ్ చార్మింగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా 'బైకర్'. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ డిఫరెంట్‌గా గూస్ బంప్స్ తెప్పించగా తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్
శర్వాను ఇప్పటివరకూ ఓ ఫ్యామిలీ స్టార్‌లా చూసిన ఆడియన్స్ 'బైకర్' మూవీలో ఓ డిఫరెంట్ లుక్‌లో చూడబోతున్నారు. బైకర్‌గా ఆయన లుక్, జోష్ గ్రేస్ అదిరిపోయాయి. చాంపియన్ రేసింగ్‌లో ఓ ప్రొఫెషనల్ బైకర్‌గా శర్వా స్టైల్ వేరే లెవల్‌లో ఉంది. 'ఇక్కడ ప్రతీ బైకర్‌కు ఓ కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకు ఎదురెళ్లే కథ. ఏం జరిగినా పట్టు వదలని మొండోళ్ల కథ.' అంటూ బిగ్ ఎలిషన్‌తో గ్లింప్స్ ప్రారంభం కాగా... బైక్ రేసర్స్ దూసుకెళ్తుంటారు. ఊహకు అందని రీతిలో ఓ సూపర్ బైక్ స్టంట్‌తో శర్వా లుక్ అదిరిపోయింది.
'గెలవడం గొప్ప కాదు చివర వరకూ పోరాడడం గొప్ప.' అంటూ ఓ మోటివేషనల్ కోట్‌తో గ్లింప్స్ ఎండ్ చేశారు. 1990, 2000 బ్యాక్ డ్రాప్‌లో సాగే కథతో రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ రూపొందినట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది.
ఈ మూవీకి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా... శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ హీరో రాజశేఖర్ శర్వా తండ్రిగా నటించనుండగా... బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తుండగా... గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ కోసమే ఆయన వర్కవుట్స్, స్ట్రిక్ట్ ఆహారపు అలవాట్లు పాటించారు. రీసెంట్‌గా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలను చూసిన ఫ్యాన్స్ 'శర్వా ఏంటీ ఇలా మారిపోయారు?' అంటూ కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
When the roads and the odds are against you, you throttle at full speed 💥🏍️#BIKER FIRST LAP - THE GLIMPSE out now!
— UV Creations (@UV_Creations) November 1, 2025
▶️ https://t.co/b0y4iVcnFo#BIKER GRAND RELEASE ON DECEMBER 6th ❤🔥#BikerGlimpse#BIKERMovie #GoAllTheWay 🏁
Charming Star @ImSharwanand #MalvikaNair… pic.twitter.com/e90ENTCsmX
Also Read : 'మాస్ జాతర' స్టార్ట్స్ - ప్రీమియర్స్ కలెక్షన్స్‌పై అఫీషియల్ పోస్టర్... ఎంతో తెలుసా?






















