అన్వేషించండి

Janhvi Kapoor Peddi First Look: 'పెద్ది'లో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్... మాంచి మాసీ రోల్, పేరు తెలుసా?

Janhvi Kapoor Role In Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా సినిమా 'పెద్ది'లో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'పెద్ది' (Peddi Movie). ఆయనకు జంటగా నయా అతిలోక సుందరి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తున్నారు. ఈ రోజు సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు. 

అచ్చియమ్మగా జాన్వీ కపూర్
Janhvi Kapoor character name in Peddi: 'పెద్ది' సినిమాలో అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఆమెది మాంచి మాసీ రోల్ అని, ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి మాసీ పాత్రలో చూస్తారని వివరించారు.  

'పెద్ది' నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కాదు... రెండు లుక్స్ రిలీజ్ చేశారు. అందులో ఒక లుక్‌లో జీపులో వెళుతూ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. మరొక లుక్‌లో మైక్ ముందు నిలబడ్డారు. బహుశా... ఆమెది జానపద గాయని పాత్ర అయ్యి ఉండొచ్చు. పెద్ది ప్రేయసి అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్ కనిపిస్తారని చిత్ర బృందం వివరించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PEDDI (@peddimovie)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PEDDI (@peddimovie)

మార్చిలో ప్రేక్షకుల ముందుకు!
Peddi Release Date: 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 'పెద్ది' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఆ వారంలో రావాల్సిన నాని 'ప్యారడైజ్' వాయిదా పడినట్లు ఫిల్మ్ నగర్ గుసగుస. 'పెద్ది'కి ముందు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' మార్చి 19న విడుదల కానుంది.

Also Read: అల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - మరి ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, జగపతి బాబు, 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో మొదటి పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం ఒక స్పెషల్ వీడియో షూట్ చేస్తారట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Also Read'మాస్ జాతర' రివ్యూ: గంజాయి బ్యాక్‌డ్రాప్‌ సినిమా... పోలీసుగా రవితేజ యాక్షన్... ఈ కమర్షియల్ సినిమా హిట్టా? ఫట్టా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
Vision Units: గ్రామ సచివాలయాలు కాదు ఇక విజన్ యూనిట్స్ - పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
గ్రామ సచివాలయాలు కాదు ఇక విజన్ యూనిట్స్ - పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 60 రివ్యూ... రీతూ సీక్రెట్ టాస్క్ ప్లాప్... తనూజా, ఇమ్మూ వెన్నుపోటు... కంటెండర్ లిస్ట్ ఇదుగో
బిగ్‌బాస్ డే 60 రివ్యూ... రీతూ సీక్రెట్ టాస్క్ ప్లాప్... తనూజా, ఇమ్మూ వెన్నుపోటు... కంటెండర్ లిస్ట్ ఇదుగో
The Great Pre Wedding Show Review - 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' రివ్యూ: తిరువీర్‌కు హ్యాట్రిక్ దక్కిందా? పల్లెటూరి కామెడీ నవ్విస్తుందా?
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' రివ్యూ: తిరువీర్‌కు హ్యాట్రిక్ దక్కిందా? పల్లెటూరి కామెడీ నవ్విస్తుందా?
Advertisement

వీడియోలు

Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
Vision Units: గ్రామ సచివాలయాలు కాదు ఇక విజన్ యూనిట్స్ - పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
గ్రామ సచివాలయాలు కాదు ఇక విజన్ యూనిట్స్ - పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 60 రివ్యూ... రీతూ సీక్రెట్ టాస్క్ ప్లాప్... తనూజా, ఇమ్మూ వెన్నుపోటు... కంటెండర్ లిస్ట్ ఇదుగో
బిగ్‌బాస్ డే 60 రివ్యూ... రీతూ సీక్రెట్ టాస్క్ ప్లాప్... తనూజా, ఇమ్మూ వెన్నుపోటు... కంటెండర్ లిస్ట్ ఇదుగో
The Great Pre Wedding Show Review - 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' రివ్యూ: తిరువీర్‌కు హ్యాట్రిక్ దక్కిందా? పల్లెటూరి కామెడీ నవ్విస్తుందా?
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' రివ్యూ: తిరువీర్‌కు హ్యాట్రిక్ దక్కిందా? పల్లెటూరి కామెడీ నవ్విస్తుందా?
The Girlfriend Movie Review - 'ది గర్ల్ ఫ్రెండ్' రివ్యూ: ఏంటీ కథ... అబ్బాయిలకు వ్యతిరేకమా? రష్మిక సినిమా హిట్టా? ఫట్టా?
'ది గర్ల్ ఫ్రెండ్' రివ్యూ: ఏంటీ కథ... అబ్బాయిలకు వ్యతిరేకమా? రష్మిక సినిమా హిట్టా? ఫట్టా?
Suresh Raina And Shikhar Dhawan: సురేష్ రైనా, శిఖర్ ధావన్‌ షాక్ ఇచ్చిన ఈడీ- రూ.11 కోట్ల ఆస్తులు జప్తు
సురేష్ రైనా, శిఖర్ ధావన్‌ షాక్ ఇచ్చిన ఈడీ- రూ.11 కోట్ల ఆస్తులు జప్తు
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుంది, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు?
ఎనిమిదో వేతన సంఘంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుంది, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు?
Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Embed widget