Sharwanand: యువిలో శర్వా డబుల్ హ్యాట్రిక్ ఫిల్మ్ - క్యారెక్టర్ రివీల్ చేశారుగా!
Sharwanand's 36th film announced officially: శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేశారు. యువి క్రియేషన్స్ సంస్థలో డబుల్ హ్యాట్రిక్ సినిమాకు శర్వా శ్రీకారం చుట్టారు.
ప్రామిసింగ్ స్టార్ శర్వానంద్, అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్... సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ల కలయికలో 'రన్ రాజా రన్', 'ఎక్స్ ప్రెస్ రాజా', 'మహానుభావుడు' సినిమాలు వచ్చాయి. ఆ మూడూ మంచి విజయాలు సాధించాయి. ఇవాళ శర్వానంద్ పుట్టినరోజు (Sharwanand Birthday) సందర్భంగా డబుల్ హ్యాట్రిక్ ఫిల్మ్ అనౌన్స్ చేశారు.
'లూజర్' ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో...
జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'లూజర్'తో తెలుగు వీక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర. శర్వానంద్ హీరోగా విక్రమ్ సమర్పణలో యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించనున్న తాజా సినిమాకు ఆయన దర్శకత్వం వహించనున్నారు. శర్వా 36వ చిత్రమిది.
వెండితెరపై దర్శకుడిగా అభిలాష్ రెడ్డికి రెండో చిత్రమిది. దీని కంటే ముందు సుధీర్ బాబు హీరోగా యువి క్రియేషన్స్ అనుబంధ సంస్థ వి సెల్యులాయిడ్స్ ఓ నిర్మాణ భాగస్వామిగా రూపొందుతున్న 'మా నాన్న సూపర్ హీరో'కి దర్శకత్వం వహించనున్నారు.
బైక్ రైడర్ పాత్రలో శర్వానంద్
Sharwanand role in his 36th film revealed: సినిమా అనౌన్స్ చేసిన సందర్భంగా ప్రీ లుక్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. అది చూస్తే... కొంత మంది రైడర్స్ దుమ్ము ధూళితో కూడిన రోడ్ మీద వెళుతున్నారు. ఓ రైడర్ జాకెట్ మీద 'ఎస్ 36' అని ఉంది. శర్వానంద్ 36వ సినిమా కనుక ఆ విధంగా 'S 36' అని రాశారు. అతను హీరో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా! ఈ ప్రీ లుక్ పోస్టర్ ద్వారా సినిమాలో శర్వానంద్ బైక్ రైడర్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది.
Happy Birthday @ImSharwanand ❤️🔥
— UV Creations (@UV_Creations) March 6, 2024
May your year be filled with adrenaline pumping adventure & conquering challenges just like our #Sharwa36 🔥@abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj @AforAnilkumar @UV_Creations pic.twitter.com/DUfoxbV0QZ
స్పోర్ట్స్ నేపథ్యంలో ఫస్ట్ టైమ్ సినిమా చేస్తున్న శర్వా
Sharwa 36 స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా రూపొందుతోంది. ''మోటర్ సైక్లింగ్ నేపథ్యంలో మూడు తరాలకు చెందిన కథతో రూపొందుతున్న చిత్రమిది. 90వ దశకం నుంచి 20వ దశకం వరకు టైమ్ పీరియడ్ లో కథా నేపథ్యం ఉంటుంది. శర్వానంద్ ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలతో, క్యారెక్టరైజేషన్లతో పోలిస్తే... ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తారు'' అని చెప్పారు.
Also Read: శర్వా కొత్త సినిమా టైటిల్ ఇదే - ఫస్ట్ లుక్‌లో చిన్నారి ఎవరంటే?
శ్వరానంద్ సరసన మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించనున్నారు. శర్వా, యువి కలయికలో ఫస్ట్ సినిమా 'రన్ రాజా రన్'కి కూడా ఆయన సంగీతం అందించారు. ఇంకా ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్ సుదీప్, కళా దర్శకుడు: ఎ పన్నీర్ సెల్వం, ఎడిటర్: అనిల్ కుమార్ పి, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, సినిమాటోగ్రఫీ: జె యువరాజ్, సమర్పణ: విక్రమ్, నిర్మాతలు: వంశీ - ప్రమోద్, రచన - దర్శకత్వం: అభిలాష్ కంకర.
Also Read: ప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ