Manamey Release Date: 'మనమే' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలోకి శర్వా సినిమా వచ్చేది ఎప్పుడంటే?
Sharwanand Maname Movie: శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న 'మనమే' విడుదల తేదీ ఖరారు చేశారు.
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా రూపొందిన సినిమా 'మనమే' (Manamey Movie). ఆయన 35వ చిత్రమిది. శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya T) దర్శకుడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు.
జూన్ 7న థియేటర్లలోకి 'మనమే'
Manamey Release Date: 'మనమే' చిత్రాన్ని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. నిజానికి ప్రతి ఏడాది వేసవి సీజన్‌లో వీలైనన్ని ఎక్కువ సినిమాలు థియేటర్లలోకి వస్తాయి. అయితే... ఈ ఏడాది ఒక వైపు ఎన్నికలు, మరొక వైపు ఐపీఎల్ ఉండటంతో సమ్మర్ సందడి అసలే లేదు. థియేటర్లు అన్నీ ఖాళీగా దర్శనం ఇచ్చాయి. పిల్లలు, ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు 'మనమే' మంచి ఛాయస్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: 'త్రినయని' తిలోత్తమ బ్యూటీ సీక్రెట్ - 50 ఏళ్ల వయసులో ఆ గ్లామర్ వెనుక కష్టం ఈ ఫోటోల్లో చూడండి
#Manamey will be yours from 𝐉𝐔𝐍𝐄 𝟕𝐭𝐡 📣✨
— People Media Factory (@peoplemediafcy) May 24, 2024
The 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of the Season is all set to paint your hearts & screens ❤️🔥
In Cinemas #ManameyOnJune7th 🥳 @ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @IamSeeratKapoor #AyeshaKhan… pic.twitter.com/lkhi5KARf6
శర్వాకు జోడీగా కృతి శెట్టి!
'మనమే'లో శర్వానంద్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించారు. ఈ సినిమాతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కుమారుడు విక్రమ్ వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్‌లో ఒక అబ్బాయి కనిపించాడు కదా! ఆ చిన్నారి దర్శకుడి కుమారుడే.
'మనమే'లో ప్లై బాయ్ తరహా ఛాయలు కనిపించే ఓ అమాయకపు పాత్రలో శర్వా నటించినట్టు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. అతడి వ్యక్తిత్వానికి పరస్పర భిన్నమైన మనస్తత్వం కల అమ్మాయిగా, బాధ్యతగా వ్యవహరించే భామగా కృతి శెట్టి నటించారని తెలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తుల ప్రయాణంలో ఏం జరిగిందనేది సినిమా. ముఖ్యంగా ఆ ఇద్దరి మధ్యలో పిల్లాడి పాత్రలో విక్రమ్ ఆదిత్య ఎంట్రీతో జీవితాలు ఎలా మారాయి? ఎంత గందరగోళం మొదలైంది? అనేది వెండితెరపై చూడాలి.
Also Read: విశాఖలో విజయ్ దేవరకొండ - ఫ్యాన్స్ మీట్‌లో రౌడీ బాయ్ రగ్గడ్ లుక్ చూశారా?
'మనమే' చిత్రానికి మలయాళ 'హృదయం', తెలుగులో 'ఖుషి', 'హాయ్ నాన్న'తో విజయాలు అందుకున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఆయన అద్భుతమైన బాణీలు అందించిన పాటలు ప్రేక్షకుల్లోకి వెళ్లాయి. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్ - ఫణి వర్మ, కూర్పు: ప్రవీణ్ పూడి, కళా దర్శకత్వం: జానీ షేక్, మాటలు: అర్జున్ కార్తీక్ - ఠాగూర్ - వెంక, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.