అన్వేషించండి

Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో నటిస్తారా? శర్వానంద్ సమాధానం ఇదే!

Sharwanand: యంగ్ హీరో శర్వానంద్‌ను తరచుగా క్రికెటర్ రోహిత్ శర్మతో పోలుస్తూ ఉంటారు ప్రేక్షకులు. అందుకే రోహిత్ శర్మ బయోపిక్‌లో అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్నకు శర్వా సమాధానమిచ్చాడు.

Sharwanand About Rohit Sharma Biopic: టాలీవుడ్‌లోని మినిమమ్ గ్యారెంటీ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. తను చేసే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చుతాయని మేకర్స్ బాగా నమ్ముతారు. ఇప్పటికే ఎన్నో ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు శర్వానంద్. అలాంటి మరో ఎమోషనల్ ఫ్యామిలీ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అదే ‘మనమే’. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనమే’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ తాజాగా జరిగింది. ఆ ఈవెంట్‌లో ఒక క్రికెటర్ బయోపిక్‌లో నటిస్తారా అనే ప్రశ్నకు శర్వానంద్ సమాధానమిచ్చాడు.

రోహిత్ శర్మతో పోలికలు..

మామూలుగా సినీ సెలబ్రిటీలను.. స్పోర్ట్స్ స్టార్స్‌తో పోల్చడం కామన్‌గా జరిగేదే. అలాగే శర్వానంద్‌ను చాలాసార్లు ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మతో పోల్చారు. ఒకవేళ రోహిత్ శర్మ బయోపిక్ తెరకెక్కిస్తే అందులో శర్వానంద్ బాగా సెట్ అవుతాడు అంటూ ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ‘మనమే’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శర్వానంద్‌కు అదే ప్రశ్న ఎదురయ్యింది. ఒకవేళ రోహిత్ శర్మ బయోపిక్ ఆఫర్ వస్తే నటిస్తారా అంటూ తనను ప్రశ్నించారు. వెంటనే ‘‘ఆలోచిస్తా’’ అంటూ సమాధానమిచ్చారు శర్వానంద్. ఇది విన్న శర్వా ఫ్యాన్స్.. వెంటనే ఈ బయోపిక్ వర్కవుట్ అయితే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..

శర్వానంద్ చివరిగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ వచ్చి దాదాపుగా రెండేళ్లు అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ‘మనమే’లాంటి ఒక రిఫ్రెషింగ్ కథతో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతీ సమ్మర్ లాగా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఏమీ లేదు. అందుకే ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను కూడా మూసేశారు. అయినా అప్పుడప్పుడు సినిమాలు విడుదల అవుతూ ఉన్నా.. అవేమీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసేలా లేవు. తాజాగా విడుదలయిన ‘మనమే’ ట్రైలర్ చూసిన తర్వాత ఇదొక కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

రెండేళ్ల తర్వాత..

2022లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో థియేటర్లలో సందడి చేశాడు శర్వానంద్. అందులో ఒకటి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కాగా మరొకటి ‘ఒకే ఒక జీవితం’. అందులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ డిశాస్టర్‌గా నిలిచినా ‘ఒకే ఒక జీవితం’ మాత్రం టైమ్ ట్రావెలింగ్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో హిట్‌ను కొట్టాడు. మధ్యలో ఏడాది పాటు గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు శర్వా. అందులో ముందుగా తన కెరీర్‌లో 35వ చిత్రంగా ‘మనమే’.. ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై టీమ్ అంతా చాలా నమ్మకంతో ఉన్నారు. ఇది ఫ్యామిలీతో పాటు యూత్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు.

Also Read: గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది, ఆ విషయంలో సంతోషంగానే ఉన్నాను - కృతి శెట్టి

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ 'రాకా'... ఒక్కటి కాదు, రెండు పార్టుల్లో రిలీజ్!?
అల్లు అర్జున్ 'రాకా'... ఒక్కటి కాదు, రెండు పార్టుల్లో రిలీజ్!?
Gatta Kusthi 2 OTT: ఓటీటీలోకి గట్ట కుస్తీ... తెలుగులోనూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి గట్ట కుస్తీ... తెలుగులోనూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Jana Nayagan Collections: విజయ్ జోరు తగ్గింది... ఆరు రోజుల్లో 'జన నాయకన్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
తెలుగులో జస్ట్ 60 లక్షలే... మరి తమిళంలో? ఆరు రోజుల్లో 'జన నాయకుడు' కలెక్షన్స్ ఎంత?
Chennai Love Story Collections: వీకెండ్ తర్వాత స్టడీగా 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్లు... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఓవర్సీస్‌లో 50 లక్షలే... మరి తెలుగు రాష్ట్రాల్లో? ఐదు రోజుల్లో 'చెన్నై లవ్ స్టోరీ' ఎంత కలెక్ట్ చేసిందంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget