shanmukh jaswanth: క్రేజీ లవ్ స్టోరీతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న 'బిగ్ బాస్' షణ్ముఖ్ - డైరెక్టర్, నిర్మాత ఎవరంటే!
Shanmukh Jaswanth: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ హీరోగా వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ క్రేజీ లవ్‌స్టోరీతో అతి త్వరలోనే హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాడు.
Shanmukh Jaswanth Entry into Silver Screen as Hero: బిగ్‌బాస్ ఫేం, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యూట్యూబ్ స్టార్ దీప్తి సునయనతో లవ్, బ్రేకప్ వ్యవహరాలతో తరచూ వార్తల్లో నిలిచాడు. ఇటీవల గంజాయి కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అలా తరచూ వివాదాలతో వార్తల్లో నిలిచిన షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్‌గా యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే కేవలం యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌తో హీరోగా చేసిన షణ్ముఖ్ అతి త్వరలోనే వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ క్రేజీ లవ్‌స్టోరీతో హీరోగా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం కాబోతున్నాడు.
తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ప్రకటన వచ్చింది. ఇవాళ (సెప్టెంబర్ 16) షణ్ముఖ్ బర్త్‌డే. ఈ సందర్భంగా షణ్మఖ్ మూవీపై ప్రకటన ఇచ్చింది మూవీ టీం. లక్కీ మీడియా, అనిల్ అండ్ భార్గవ్ సినిమాస్ పతాకాలపై షణ్ముఖ్ హీరోగా ఓ క్రేజీ లవ్ స్టోరీ రాబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించనుంది మూవీ టీం. ఈరోజు షణ్మఖ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలో అతడి లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. షణ్ముఖ్ బ్యాక్ నుంచి డార్క్ థీమ్‌తో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనికి "సిల్వర్ స్క్రీన్‌కు షణ్ముఖ్‌ను పరిచయం చేస్తూ... హ్యాపీ బర్త్‌డే" అంటూ విషెస్ తెలిపారు. ఇది అతడి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎట్టకేలకు షణ్ముఖ్‌ను వెండితెరపై హీరోగా చూడబోతున్నామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు 'సినిమా చూపిస్తా మావా' వంటి హిట్ సినిమాలు తీసిన బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
From the digital frame to the cinematic lens💥@luckymediaoff and #AnilandBhargavCinemas Join hands to Introduce #ShanmukhJaswanth to the silver screen in a crazy love story❤️🔥
— Eluru Sreenu (@IamEluruSreenu) September 16, 2024
Happy Birthday SHANNU🤗
More Details Soon💥@BekkemVenugopal#HappyBirthdayShannu pic.twitter.com/kASZpO698L
'సాఫ్ట్‌వేర్ డేవ్ లవ్ పర్'తో గుర్తింపు
షణ్ముఖ్ యూట్యూబ్ వెబ్ సిరీస్ 'సాఫ్ట్‌వేర్ డేవ్ లవ్ పర్', 'సూర్య' వంటి వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల ఓటీటీలోకి కూడా అడుగుపెట్టాడు. అతడు హీరోగా నటించిన 'లీలా వినోదం' అనే సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ (ETV Win App) యాప్ లో నేరుగా రిలీజ్ కానుంది. ఇక ఇప్పుడు ఏకంగా అతడు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.
బిగ్‌బాస్‌తో సెన్సేషన్
యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన షణ్ముఖ్ బిగ్‌బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొన్న సంగతి తెలిసింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లో సందడి చేశాడు. హౌజ్‌లో కో కంటెస్టెంట్ సిరి హన్మంత్‌తో లవ్ ట్రాక్‌తో సెన్సేషన్ అయ్యాడు. హౌజ్ బయట దీప్తితో ప్రేమలో మునిగి తేలిన షణ్ముఖ్... హౌజ్‌లో సిరితో లవ్ ట్రాక్ నడిపించడంతో ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఇద్దరికి బయట వేరు వేరుగా రిలేషన్ ఉండి.. హౌజ్‌లో సన్నిహితంగా మెదులుతూ, ముద్దులు, హగ్‌లతో రెచ్చిపోయారు. దీంతో సోషల్ మీడియాలో ఇద్దరు దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇక హౌజ్‌నుంచి బయటకు రాగానే షణ్ముఖ్, దీప్తి సునయనకు బ్రేకప్ కూడా అయ్యింది. ఇప్పటికి ఈ అంశం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గానే ఉంది.
Also Read: 'ధూమ్ 4'లో సూర్య... బాలీవుడ్ సినిమాలో విలన్‌గా రోలెక్స్‌కు ఛాన్స్?