News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Jawan: ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ - షారుఖ్ ‘జవాన్’ కోసం ఆ ఆరుగురు!

తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి షారుఖ్ ఖాన్ చేస్తున్న సినిమానే ‘జవాన్’. ఇందులో షారుఖ్‌తో మొదటిసారి జతకడుతోంది నయనతార.

FOLLOW US: 
Share:

ఒక్కొక్కసారి సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకం, డైరెక్టర్ మీద ఉన్న నమ్మకంతో ఆ మూవీని ఎంత భారీ బడ్జెట్‌తో అయినా నిర్మించడానికి మేకర్స్ ముందుకొస్తారు. పైగా హీరోనే నిర్మాతగా వ్యవహరిస్తే.. ఆ స్వేచ్ఛతో తనకు నచ్చిన కథపై మరింత ఎక్కువ ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘జవాన్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ‘జవాన్‌’ను పూర్తిగా నమ్మిన షారుఖ్.. బడ్జెట్ ఎక్కువ అవుతున్నా కూడా పట్టించుకోకుండా ఖర్చు చేసేస్తున్నాడట. అంతే కాకుండా ఇప్పటివరకు షారుఖ్ కెరీర్‌లో ఇంత భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కలేదని సమాచారం. ఒకవైపు మూవీ బడ్జెట్ గురించి ఇన్ని విధాలుగా వార్తలు వైరల్ అవుతున్న క్రమంలోనే తాజాగా ‘జవాన్’ గురించి మరొక సెన్సేషనల్ విషయం బయటికొచ్చింది.

తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి షారుఖ్ ఖాన్ చేస్తున్న సినిమానే ‘జవాన్’. ఇందులో షారుఖ్‌తో మొదటిసారి జతకడుతోంది నయనతార. అంతే కాకుండా నయనతారకు ఇదే మొదటి హిందీ చిత్రం. ఈ మూవీని తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ ద్వారా నిర్మిస్తున్నాడు షారుఖ్. అందుకే ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు లేని విధంగా ఆరుగురు యాక్షన్ డైరెక్టర్స్‌ను ‘జవాన్’ కోసం రంగంలోకి దించాడట బాలీవుడ్ బాద్‌షా. ఇందులో బాలీవుడ్ మాత్రమే కాదు,కోలీవుడ్‌కు చెందిన యాక్షన్ డైరెక్టర్స్ మాత్రమే కాదు.. హాలీవుడ్‌కు చెందినవారు కూడా ఉన్నారు. 

స్పిరో రాజాటోస్
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ లాంటి ఫేమస్ హాలీవుడ్ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేశాడు స్పిరో. అందుకే ఆయన వర్క్ నచ్చి ‘రావన్’కు యాక్షన్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఈ యాక్షన్ డైరెక్టర్‌తో కలిసి షారుఖ్ చేస్తున్న రెండో చిత్రం ‘జవాన్’.

యానిక్ బెన్
‘ట్రాన్స్‌పోర్టర్ 3’, ‘ఇన్సెప్షన్’లాంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేసిన యానిక్.. పలు హిందీ చిత్రాలకు కూడా పనిచేశాడు. అందులో షారుఖ్ నటించిన ‘రెయీస్’ కూడా ఒకటి. ఈ యాక్షన్ డైరెక్టర్ ఇంగ్లీష్, హిందీతో పాటు పలు తెలుగు చిత్రాలకు కూడా పనిచేశాడు.

క్రెయిగ్ మ్యాక్రే
‘యావెంజర్స్’లాంటి సూపర్ హీరో చిత్రాలలో యాక్షన్‌ను డైరెక్ట్ చేశాడు క్రెయిగ్. దీంతో పాటు ‘మ్యాడ్ మాక్స్’ వంటి చిత్రానికి కూడా పనిచేశాడు.

కెచా ఖంఫాక్డే
హాలీవుడ్‌లోని ప్రముఖ యాక్షన్ డైరెక్టర్లలో కెచా ఒకరు. అయితే ఇంగ్లీష్ సినిమాలకు మాత్రమే కాకుండా ఆయన అప్పుడప్పుడు ఇండియన్ సినిమాలకు కూడా పనిచేశాడు. అందులో ‘తుపాకీ’, ‘బాహుబలి 2’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇక హిందీలో ‘భాగీ 2’ తర్వాత కెచా చేస్తున్న చిత్రం ‘జవాన్’.

సునీల్ రోడ్రీగూస్
సునీల్.. గత కొంతకాలంగా బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్షన్ డైరెక్టర్‌గా వెలిగిపోతున్నాడు. ‘షెర్షా’, ‘సూర్యవంశీ’, ‘పతాన్’ వంటి చిత్రాలకు ఫైట్స్ డిజైన్ చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ‘జవాన్’ కోసం పనిచేయడానికి సిద్ధమయ్యాడు.

అనల్ అరసు
అనిల్ అరసు ఇప్పటికే తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో మంచి యాక్షన్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సుల్తాన్’, ‘ఖైదీ’, ‘కిక్’ వంటి చిత్రాలకు పనిచేసినందుకు తనకు మంచి గుర్తింపు లభించింది.

Also Read: ‘జవాన్’ సెన్సార్ రిపోర్ట్: ఆ డైలాగ్ తొలగింపు, ‘రాష్ట్రపతి’పై అభ్యంతరం - 7 కట్స్‌తో సర్టిఫికెట్ జారీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 23 Aug 2023 11:53 AM (IST) Tags: Atlee Shah Rukh Khan Jawan Nayanthara action directors

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే