Wild Breath: జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు నిర్మాతగా సస్పెన్స్ థ్రిల్లర్ 'వైల్డ్ బ్రీత్': ఫస్ట్ లుక్ విడుదల... చంద్రబాబు ఏమన్నారంటే?
Parvathaneni Rambabu: జర్నలిజం నుంచి చిత్రనిర్మాణంలోకి అడుగు పెట్టిన పాత్రికేయ ప్రముఖులు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులో పర్వతనేని రాంబాబు చేరారు. ఆయన 'వైల్డ్ బ్రీత్' మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సినిమా జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి... ఆ తర్వాత చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టిన పాత్రికేయ ప్రముఖులు కొందరు ఉన్నారు. వందల సినిమాలకు పీఆర్వోగా చేయడంతో పాటు మ్యాగజైన్స్ రన్ చేసిన బీఏ రాజు, సురేష్ కొండేటి పలు సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. 'బేబీ' వంటి హిట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసిన ఎస్కేఎన్ కూడా ఒకప్పుడు జర్నలిస్ట్. ఇప్పుడు ఈ జాబితాలోకి సీనియర్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు (Parvataneni Rambabu) చేరారు.
పర్వతనేని రాంబాబు నిర్మాతగా 'వైల్డ్ బ్రీత్'!
సినిమా మీడియాలో పర్వతనేని రాంబాబుది పాతికేళ్ల జర్నీ. ప్రజెంట్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరానికి తొలుత అవకాశం ఇచ్చింది ఆయనే. పర్వతనేని బాబు నిర్మాణంలో కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అక్కడి నుంచి హీరోగా ఎదిగారు.
పర్వతనేని రాంబాబు ఇప్పుడు ఫీచర్ ఫిలిం ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. గతంలో 'రేవు' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన ఆయన... ప్రస్తుతం సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం మీద డాక్టర్ మురళి చంద్ గింజుపల్లితో కలిసి 'వైల్డ్ బ్రీత్' (Wild Breath) సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 13న పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'వైల్డ్ బ్రీత్' చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ప్రముఖ నటుడు శివాజీ రాజా ఫస్ట్ లుక్ విడుదల చేయగా... నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా పాల్గొన్నారు. రాంబాబు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అతనితో తన స్నేహం కొనసాగుతుందని, ఈ సినిమా టైటిల్ - ఫస్ట్ లుక్ చాలా బాగున్నాయని శివాజీ రాజా తెలిపారు కథ బాగుంటే హీరోలు అవసరం లేదని, కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేసే సినిమా 'వైల్డ్ బ్రీత్' అని ఆయన పేర్కొన్నారు.
పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ... ''జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశా. మా 'వైల్డ్ బ్రీత్' సినిమా గురించి ఆయనకు వివరించాను. త్వరలోనే మరొక అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని పిలుస్తానని చెప్పారు. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు. ఆయన మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. నేను పిలవగానే వచ్చిన శివాజీ రాజా గారికి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి, ప్రసన్న కుమార్ గారికి థాంక్స్. నిర్మాత మురళి చంద్ గింజుపల్లి గారు నన్ను నమ్మి నిర్మాణ బాధ్యతలు నా చేతిలో పెట్టారు. ఆయనకు థాంక్స్. 'వైల్డ్ బ్రీత్' చిత్రీకరణ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాతో హరినాథ్ పులి దర్శకుడిగా ప్రూవ్ చేసుకుంటాడు. త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అని దర్శకుడు హరినాథ్ పులి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
'వైల్డ్ బ్రీత్' చిత్రానికి కళ: మల్టీ వినోద్ రావేల, కూర్పు: శ్రీహరి సురేష్, కెమెరా: రేవంత్ సాగర్, సంగీతం: వైశాఖ్ మురళీధరన్, నిర్మాతలు: డాక్టర్ మురళీ చంద్ గింజుపల్లి - పర్వతనేని రాంబాబు, రచన - దర్శకత్వం: హరినాథ్ పులి.





















