సినిమాలకు రిటర్మెంట్ ప్రకటించిన సీనియర్ నటి
సీనియర్ నటీమణుల్లో తులసి ఒకరు. ఆవిడ సినిమాలకు రిటర్మెంట్ ప్రకటించారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత నుంచి తాను ఏం చేయబోతున్నదీ వివరించారు.

మోస్ట్ ట్యాలెంటెడ్ సీనియర్ ఆర్టిస్టుల్లో తులసి ఒకరు. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆవిడ... దక్షిణాది నాలుగు భాషలు తెలుగు - తమిళ్ - మలయాళం - కన్నడలో సినిమాలు చేశారు. భోజ్‌పురి భాషలోనూ నటించారు. ఇప్పుడు సినిమాలకు, నటనకు స్వస్తి పలుకుతున్నట్టు తులసి ప్రకటించారు. తన రిటర్మెంట్ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
డిసెంబర్ 31 నుంచి నో మూవీస్...
ఆ షిరిడీ సాయినాథుని సన్నిధిలో!
నటి తులసికి సాయిబాబా అంటే అపారమైన భక్తి. సోషల్ మీడియాలో ఆవిడ అకౌంట్ ఫాలో అయ్యే ప్రేక్షకులకు ఆ సంగతి తెలుస్తుంది. తరచూ షిరిడి వెళ్లి వస్తుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 31న తాను షిరిడీ వెళుతున్నట్టు తులసి వివరించారు. ఆ తర్వాత నుంచి సినిమాలకు రిటర్మెంట్ ప్రకటించి సాయినాథుని సన్నిధిలో గడపాలని అనుకుంటున్నట్టు తులసి పోస్ట్ చేశారు.
Also Read: నయనతారకు భర్త సర్‌ప్రైజ్... బర్త్ డే గిఫ్ట్ అదిరింది విఘ్నేషూ - ఆ కారు రేటెంతో తెలుసా!?
View this post on Instagram
మూడు నెలల వయసులో సినిమాల్లోకి...
సావిత్రి, తులసి మధ్య అనుబంధం ఏమిటంటే?
మూడు నెలల వయసు ఉన్నప్పుడు తులసి తెరంగేట్రం చేశారు. మహానటి సావిత్రి, తులసి తల్లి స్నేహితులు. 'భార్య' సినిమా చిత్రీకరణ చేస్తున్న సమయంలో ఓ పాటలో పసికందు అవసరం అయ్యింది. అప్పుడు తులసి తల్లిని సావిత్రి రిక్వెస్ట్ చేసి పసికందును తన ఒడిలో పెట్టుకున్నారు. అది తులసి మొదటి సినిమా. ఆ తర్వాత నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు 'జీవన తరంగాలు'తో పూర్తిస్థాయి బాలనటిగా మారారు. 'సీతామహాలక్ష్మీ', 'శంకరాభరణం' సినిమాలకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డులు సైతం అందుకున్నారు.
Also Read: వాట్సాప్ స్కామ్ బాధితులు... మొన్న అదితి... ఇప్పుడు శ్రియ... అసలు ఏం జరిగిందంటే?
View this post on Instagram
తులసికి 28 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆమె పెళ్లి జరిగింది. కన్నడ దర్శకుడు శివమణిని వివాహమాడారు. ఈ దంపతులకు ఓ అబ్బాయి ఉన్నాడు. అతని పేరు సాయి తరుణ్. పెళ్లి తర్వాత నటిగా సినిమాలు కంటిన్యూ చేశారు తులసి. 'మిస్టర్ పర్ఫెక్ట్', 'డార్లింగ్', 'శశిరేఖా పరిణయం', 'శ్రీమంతుడు', 'ఇద్దరమ్మాయిలతో', 'మహానటి', 'డియర్ కామ్రేడ్', 'నేను లోకల్' వంటి సినిమాల్లో తులసి నటించారు.





















