(Source: ECI/ABP News/ABP Majha)
Silk Smitha: సిల్క్ స్మితకి అసలు డ్యాన్స్ రాదు - అప్పట్లో గ్రేట్ డ్యాన్సర్స్ అంటే వాళ్ళే: డిస్కో శాంతి
దివంగత నటుడు శ్రీహరి సతీమణి డిస్కో శాంతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ తో ఎంతో పాపులారిటీని తెచ్చుకున్న డిస్కో శాంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా 1990 ల కాలంలో కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఐటెం సాంగ్స్ తో పాటు పలు సినిమాల్లో నటిగానూ మెప్పించారు. ఇక ఆ తర్వాత రియల్ స్టార్ శ్రీహరిని వివాహం చేసుకున్నారు. కాగా 2013లో శ్రీహరి అనారోగ్య కారణాలతో మరణించగా, అప్పటినుంచి డిస్కో శాంతి కుటుంబం, పిల్లల బాధ్యతను చూసుకుంటున్నారు. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి చెన్నైలోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి సిల్క్ స్మిత పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఇంటర్వ్యూలో డిస్కో శాంతి మాట్లాడుతూ.. "నా జీవితంలో గోల్డెన్ డేస్ వచ్చాయంటే అది శ్రీహరిని పెళ్లి చేసుకున్న తర్వాతే. ఆయనతో కలిసి ఉన్న రోజులే నా జీవితంలో గోల్డెన్ డేస్. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ వీళ్ళ అందరి తర్వాతే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు అసలు డాన్స్ అంటే తెలియదు. నాకంటే ముందు వచ్చిన వాళ్లంతా మంచి డాన్సర్స్. ముఖ్యంగా జ్యోతిలక్ష్మి, జయమాలిని కంటే గ్రేస్ గా డాన్స్ చేసిన వాళ్ళు ఇండ్రస్ట్రీలో ఎవరూ లేరు. సిల్క్ స్మిత విషయానికొస్తే, తన వే ఆఫ్ స్టైల్ బాగుంటుంది. సిల్క్ స్మిత కి కి డాన్స్ రాదు. కాకపోతే ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుంది. అలాగే తన బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది’’ అని అన్నారు.
"తనలాంటి బాడీ లాంగ్వేజ్ ఒక్క జయమాలిని గారికి ఉండేది. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో శిల్పం లాంటి బాడీ స్ట్రక్చర్ ఉన్న ఏకైక నటి కూడా జయమాలిని. అలాంటి బాడీ స్ట్రక్చర్ ఇంకెవరికి లేదు. సిల్క్ స్మితకు వచ్చి ఒక అమెరికన్ బాడీ స్ట్రక్చర్ స్టైల్ ఉంటుంది. అంతే తప్పితే సిల్క్ స్మిత పెద్ద డాన్సర్ ఏమీ కాదు. జయమాలిని, జ్యోతిలక్ష్మి మంచి డాన్సర్స్. జయమాలిని మా స్కూల్ టైం డ్యాన్సర్. నేను వచ్చినప్పటికీ జయమాలిని ఇంకా ఇండ్రస్ట్రీ లోనే ఉన్నారు. జ్యోతిలక్ష్మితో వర్క్ చేయలేదు కానీ జయమాలిని, సిల్క్ స్మిత, అనురాధ.. వీళ్ళందరితో వర్క్ చేశాను. సిల్క్ స్మిత తోటి నాలుగు సినిమాలు చేశాను. తను సొంతంగా నిర్మించిన మూడు సినిమాల్లో నేను చేశాను. వాటిలో రెండు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాను" అని తెలిపారు.
"ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలు చేశాం. సిల్క్ స్మిత నాతోటి బాగానే ఉంటుంది. నన్ను ఒక చిన్న పాప లాగా చూసుకుంటుందంటూ చెప్పింది. ఇక తర్వాత సిల్క్ స్మిత సూసైడ్ గురించి మాట్లాడుతూ, తన పర్సనల్ లైఫ్ గురించి నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆమె పర్సనల్ లైఫ్ చూడలేదు. నేను, స్మిత చెన్నైలో షూటింగ్ చేసినప్పుడు ఆమె నాతో హ్యాపీగా ఉండేది. బాధపడుతున్నాను అని ఎప్పుడూ చెప్పేదికాదంటూ" సిల్క్ స్మిత గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు డిస్కో శాంతి.
Also Read : మీ ఇంటికే వస్తున్న ‘బేబీ’ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial