By: ABP Desam | Updated at : 18 Aug 2023 01:10 PM (IST)
Image Credit: Aha/Twitter
చిన్న సినిమాగా విడుదలై థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘బేబీ’ ఇప్పుడు ఓటీటీకి వచ్చేస్తోంది. ఆనంద్ దేవర కొండ, విరాజ్ నటించిన ఈ మూవీకి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే, ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆహా’ ఓటీటీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు గోల్డెన్ ఆఫర్..
‘ఆహా’ ఇప్పటికే ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను, ఒరిజినల్ సిరీస్‌లను తన సబ్‌స్క్రైబర్స్‌కు అందించింది. త్వరలోనే ‘బేబి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని కూడా స్ట్రీమ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్ట్ 25న ఆహాలో ‘బేబి’ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలో ఆహా.. తన గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు సూపర్ ఆఫర్‌ను అందిస్తోంది. రూ.899తో ఆహా గోల్డ్ ప్యాక్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు ‘బేబి’ మూవీ ఇతర సబ్‌స్క్రైబర్స్ ముందుకు రాకముందే, అంటే 12 గంటల ముందే యాప్‌లో సినిమాను చూసేయవచ్చని తెలిపింది.
ఆహా సబ్‌స్క్రిప్షన్‌లో మార్పులు..
ఆహా తన గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కోసం మరెన్నో సౌలభ్యాలు అందిస్తోంది. ఈ సబ్‌స్క్రైబర్ ఆహాలో సినిమాలను, వెబ్ సిరీస్‌లను 4కే డాల్బీ ఆట్మాస్‌లో చూసేటప్పుడు ఎలాంటి యాడ్స్ ఉండవని వెల్లడించింది. ఆహా తెలుగు మాత్రమే కాదు.. ఆహా తమిళంలో కూడా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు ఇలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఆఫర్లు ప్రవేశపెట్టిన తర్వాత నుండి ఆహా సబ్‌స్క్రైబర్స్ కౌంట్ పెరిగినట్టు సమాచారం. ఇక ఆహా సబ్‌స్క్రిప్షన్ విషయానికొస్తే.. రూ.699కే ఏడాది పాటు ఎలాంటి యాడ్స్ లేకుండా ఆహాలో సినిమాలు చూడవచ్చు. రూ.399తో సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్స్ ఉంటాయి. రూ.199 సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే మూడు నెలల పాట ఆహాలో యాడ్స్‌తో సినిమాలు, సిరీస్‌లు చూడవచ్చు. రూ.99 లాంటి ప్యాకేజ్ కూడా మొబైల్ యూజర్స్‌కు అందుబాటులో ఉంది. ఆహా సబ్‌స్క్రిప్షన్ ధరల్లో జరిగిన మార్పుల విషయాన్ని స్వయంగా వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ స్ట్రాటజీ, ఎస్‌వీఓడీ హెడ్ రాకేష్ సీకే ప్రకటించారు.
కల్ట్ క్లాసిక్ బొమ్మ..
సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బేబి’ చిత్రం యూత్‌ను విపరీతంగా ఆకట్టుకొని సెన్సేషనల్ హిట్ అయ్యింది. సినిమా విడుదలయ్యి నెలరోజులపైనే అయినా ఇంకా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారంటే ఇది ఒక్కొక్కరికి ఏ రేంజ్‌లో కనెక్ట్ అయ్యిందో అర్థమవుతోంది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్‌ల యాక్టింగ్ మనసుకు హత్తుకుపోయేలా ఉందని చాలామంది ప్రేక్షకులు ప్రశంసించారు. మరికొందరు మాత్రం అసలు ఇది సినిమానేనా అని కామెంట్స్ చేశారు కూడా. అయినా కలెక్షన్స్ పరంగా ‘బేబి’ కొత్త రికార్డులతో దూసుకుపోయింది. కల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ‘బేబి’.. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడానికి పరుగులు తీస్తోంది.
Also Read: 'ప్రేమ్ కుమార్' రివ్యూ : పీటల మీద పెళ్లి ఆగితే? ఈసారైనా సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Lokesh Kanagaraj Fight Club : ఫైట్క్లబ్తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్‌గా మాత్రం కాదు
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
Ram Charan: ‘ఓటు’ కోసం షూటింగ్ ఆపేసిన చరణ్, ఇంటికి తిరుగు ప్రయాణం
Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్
Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ఓటీటీ అప్డేట్ - ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అంటే?
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!
/body>