News
News
X

Sardar Jawan Rumors: ఆ వార్తలన్నీ అవాస్తవం, సర్దార్, జవాన్ సినిమాలపై వస్తున్న పుకార్లను ఖండించిన ఎడిటర్!

తమిళ స్టార్ హీరో కార్తీ నటించి ‘సర్దార్’, బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాలపై వస్తున్న ఊహాగానాలను ఎడిటర్ రూబెన్ కొట్టిపారేశారు. ఆ వార్తలన్నీ కేవలం పుకార్లని తేల్చి చెప్పారు.

FOLLOW US: 
 
తమిళ స్టార్ హీరో కార్తీ నటించి ‘సర్దార్’, బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాలపై వస్తున్న ఊహాగానాలను ఎడిటర్ రూబెన్ కొట్టిపారేశారు. ఆ వార్తలన్నీ కేవలం పుకార్లని తేల్చి చెప్పారు.

తమిళ హీరో కార్తీనటించిన తాజా సినిమా ‘సర్దార్’. ఈ సినిమాకు సంబంధించిన ట్రూలర్ సినిమాపై ఓ రేంజిలో అంచనాలను పెంచుతున్నది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్నది. ఈ సినిమాను పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలయ్యింది. షారుఖ్ తాజాగా నటిస్తున్న ‘జవాన్’ కథ మాదిరిగానే ఈ సినిమా కథ ఉందని చర్చ నడుస్తున్నది. అటు తమిళ దర్శకుడు అట్లీ, షారుఖ్ హీరోగా ‘జవాన్’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్నది.   

News Reels

అటు ఈ  సినిమాల కథలకు సంబంధించి వస్తున్న ఊహాగానాలను ఎడిటర్ రూబెన్ ఖండించారు. ఈ రెండు సినిమాలకు ఆయనే ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా తప్పుబట్టారు. ఈ రెండు సినిమాల కథలకు అసలు పోలికే లేదని వెల్లడించారు.  కార్తి ‘సర్దార్’ మూవీ ఈ నెల 21న విడుదల కానుండగా, షారుఖ్ ‘జవాన్’ మూవీ వచ్చే ఏడాది జూన్ 2న విడుదల కానుంది.

స్పై యాక్షన్ థ్రిల్లర్సర్దార్’

సర్దార్ సినిమాలో కార్తీ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నది.  స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. అన్న పూర్ణ స్టూడి యోస్ ఈ సినిమాని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో  విడుదల చేస్తోంది. రజిషా విజయన్, చుంకీ, లైలా, ముని ష్కాంత్, అశ్విన్, యోగ్ జాపి, నిమ్మి, బాలాజీ శక్తి వేల్, ఎలవరసు సహా పలువురు నటీనటుల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే విడుదలైన 'సర్దార్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాపై ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

Read Also: పాన్ ఇండియన్ స్టార్ తో పవర్ స్టార్ బ్యూటీ జోడీ, నిధి అగర్వాల్ కు సూపర్ ఆఫర్!

జైవాన్’లో షారుఖ్ డ్యుయెల్ రోల్!

ఇక బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ చివరి సినిమా 2018లో వచ్చింది ‘జీరో’ పేరుతో విడుదలైన ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఇప్పటికే నాలుగేళ్లు పూర్తయినా ఆయన కొత్త సినిమా విడుదల కాలేదు. ఎప్పుడెప్పుడు ఈయన సినిమా విడుదలవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ‘జ‌వాన్’ ఒక‌టి. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలను పెంచాయి.   ‘జవాన్‌’ సినిమాలో షారుఖ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి, కొడుకుగా రెండు పాత్రలో పోషిస్తున్నాడు.  షారుఖ్‌కు జోడీగా నయనతార హీరోయిన్‌ గా చేస్తున్నది. ప్ర‌స్తుతం షారుఖ్ న‌టించిన ‘ప‌ఠాన్’ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది.  సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా  దీపికా ప‌దుకొనే  యాక్ట్ చేస్తున్నది. అటు రాజ్ కుమార్ హిరాణి ద‌ర్శ‌క‌త్వంలో షారుఖ్‌ ‘డుంకి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో తాప్సీ హీరోయిన్ గా చేస్తున్నది.   

Published at : 16 Oct 2022 05:51 PM (IST) Tags: Sardar Jawan Rumors Editor Ruben Sardar- Jawan Storyline

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

IND vs BAN 1st ODI: నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

IND vs BAN 1st ODI:  నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

Anchor Dolly: బ్లాక్ డ్రెస్ లో యాంకర్ డాలీ హొయలు

Anchor Dolly: బ్లాక్ డ్రెస్ లో యాంకర్ డాలీ హొయలు