Saranga Dariya: 'సారంగ దరియా'కు లాభాలు... భారీ సినిమాల జోరులోనూ బ్రేక్ ఈవెన్!
Saranga Dariya box office collection: భారీ సినిమాల జోరులో ఓ చిన్న సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యిందంటే గొప్ప విషయమే. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన 'సారంగ దరియా' ఆ ఫీట్ సాధించింది.
రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) జూన్ 27న థియేటర్లలోకి వస్తే... ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. 'కల్కి 2898 ఏడీ' తర్వాత థియేటర్లలోకి వచ్చిన భారీ సినిమా 'భారతీయుడు 2' (Bharateeyudu 2). దానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా ఓపెనింగ్స్ భారీ రాబట్టింది. కమల్ హాసన్ సినిమాతో పాటు థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'సారంగ దరియా' (Saranga Dariya Movie). ఇప్పటి వరకు తెలుగులో రానటువంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అని మంచి టాక్ తెచ్చుకుంది. చాప కింద నీరులా ఈ సినిమా లాభాల్లోకి వెళ్లింది.
మూడు కోట్లకు పైగా వసూళ్లు... నిర్మాతకు లాభాలు!
Saranga Dariya movie collection worldwide: 'సారంగ దరియా' సినిమాలో లెక్చరర్ కృష్ణకుమార్ పాత్రలో ముగ్గురు పిల్లలకు తండ్రిగా రాజా రవీంద్ర నటించారు. జూలై 12న సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 200 స్క్రీన్స్ ఈ సినిమాకు లభించాయి. నిర్మాతలు ఉమా దేవి, శరత్ చంద్ర డైరెక్టుగా డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను అమ్మేయకుండా కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేశారు.
Saranga Dariya First Week Collection: ఫస్ట్ వీక్... జూలై 12 నుంచి జూలై 18 వరకు 'సారంగ దరియా'కు మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ లభించింది. షేర్ కలెక్షన్స్ రెండు కోట్లు వచ్చాయని తెలిసింది. పేరుకు చిన్న సినిమా కానీ 'సారంగ దరియా'కు రెండు కోట్ల బడ్జెట్ అయ్యింది. ఇప్పుడు ఆ అమౌంట్ అంతా థియేట్రికల్ కలెక్షన్స్ ద్వారా వచ్చింది. దాంతో నిర్మాత లాభాల్లోకి వెళ్లారు. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మలేదు. సో... వాటి ద్వారా వచ్చే డబ్బులు బోనస్ అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల్లో ఓ చిన్న సినిమాకు కలెక్షన్స్ రావడం సంగతి అటు ఉంచితే... బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది గొప్ప విషయం అని చెప్పాలి.
మండే నుంచి పెరగనున్న థియేటర్లు
సాధారణంగా కొత్త సినిమాలు విడుదల అయితే... లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమా స్క్రీన్స్ కౌంట్ తగ్గుతుంది. 'సారంగ దరియా'కు సైతం శుక్రవారం కొన్ని థియేటర్లు తగ్గాయి. అయితే... ఇప్పుడు మండే నుంచి మళ్లీ స్క్రీన్స్ కౌంట్ పెరగనున్నాయని, పెంచే ప్రయత్నాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని తెలిసింది.
Also Read: సూపర్ హిట్ పెయిర్ అజిత్, త్రిష ఈజ్ బ్యాక్ - 'విడా ముయర్చి'లో థర్డ్ లుక్ చూశారా?
'సారంగ దరియా'కు వస్తున్న స్పందన పండు అలియాస్ పద్మారావు అబ్బిశెట్టి - నిర్మాతలు ఉమా దేవి, శరత్ చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ కాన్సెప్ట్ మీద ఇప్పటి వరకు ఈ తరహా సినిమా రాలేదని, ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించరని ఓ అపోహ ఉందని, కానీ ఈ విజయం ఇటువంటి కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయడానికి ఉత్సాహం అందించిందని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read: బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?