Santhana Prapthirasthu: సంతాన ప్రాప్తిరస్తు... తెలుసా నీకోసమే, రొమాంటిక్ మెలోడీ!
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు' నుంచి రొమాంటిక్ మెలోడీ 'తెలుసా నీ కోసమే' రిలీజ్ అయ్యింది. ఈ పాట గురించి అగ్ర నిర్మాత సురేష్ బాబు ఏమన్నారో తెలుసా?

జనాభాలో చైనాను దాటేసిన మన దేశంలో, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతావనిలో ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్స్ ఎందుకు పెరిగాయి? అనే కథాంశంతో రూపొందుతున్న వినోదాత్మక సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ సంస్థలపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో 'తెలుసా నీకోసమే' పాటను విడుదల చేశారు.
భార్యాభర్తల అనుబంధం... రొమాంటిక్ సాంగ్!
కొత్తగా పెళ్ళైన జంట మధ్య బ్యూటిఫుల్ బాండింగ్, రొమాన్స్ చూపించేలా 'తెలుసా నీకోసమే' పాటను చిత్రీకరించినట్టు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది. ఈ పాటను అగ్ర సురేష్ బాబు విడుదల చేశారు. అజయ్ అరసాడ అందించిన బాణీకి శ్రీమణి సాహిత్యం అందించగా... 'వాయిస్ ఆఫ్ రొమాన్స్'గా పేరు పొందిన అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునేలా పాడారు.
'తెలుసా నీకోసమే' పాట విడుదల కార్యక్రమంలో మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... ''సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ నుంచి బిజీ లైఫ్ గడిపే పలువురిలో పిల్లలు పుట్టకపోవడం అనేది సమస్యగా మారింది. కొన్నేళ్లుగా మొదలైన ఈ సమస్య నేపథ్యంలో తీసిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. ఎటువంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా చూశాం'' అన్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ... ''ఫెర్టిలిటీ సమస్యపై తీసిన సినిమా అయినా ఎక్కడా సందేశాలు ఇవ్వలేదు. వినోదాత్మకంగా తెరకెక్కించాం. మా హీరో విక్రాంత్, నిర్మాతల సహకారంతో బాగా చేశాం'' అని చెప్పారు.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
'సంతాన ప్రాప్తిరస్తు' హీరో విక్రాంత్ మాట్లాడుతూ... ''ప్రస్తుతం సమాజంలో ఎంతో మంది ఎదుర్కొంటున్న బర్నింగ్ ఇష్యూను ఎటువంటి సందేశం ఇవ్వకుండా చక్కగా వినోదాత్మకంగా చెప్పిన చిత్రమిది. కథ విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇందులో నా నటనకు పేరొస్తే దానికి కారణం మా దర్శకుడు సంజీవ్ రెడ్డి'' అని చెప్పారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... ''టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మధుర శ్రీధర్ నాకు మంచి ఫ్రెండ్. సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి నిర్మాతగా మారారు. ఆయన ఎఫర్ట్స్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ కావాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.
Also Read: 'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!
Santhana Prapthirasthu Cast And Crew: విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన 'సంతాన ప్రాప్తిరస్తు'లో 'వెన్నెల' కిశోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, 'తాగుబోతు' రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీలా, సద్దామ్, రియాజ్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మహిరెడ్డి పండుగుల, కూర్పు: సాయికృష్ణ గనల, ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మచ్చ, కాస్ట్యూమ్ డిజైనర్లు: అశ్వత్ భైరి - కె. ప్రతిభ రెడ్డి, నృత్య దర్శకత్వం: లక్ష్మణ్ కాళహస్తి, కథ, కథనం: సంజీవ్ రెడ్డి - షేక్ దావూద్ .జి, మాటలు: కల్యాణ్ రాఘవ్, నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి - నిర్వి హరిప్రసాద్ రెడ్డి, దర్శకత్వం: సంజీవ్ రెడ్డి.





















