Sankranti Ki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం... రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన వెంకటేష్!
Venkatesh Anil Ravipudi New Movie: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా విడుదల తేదీని ఇవాళ కన్ఫర్మ్ చేశారు. సంక్రాంతికి వస్తున్నామని స్పష్టం చేశారు.
విక్టరీ వెంకటేష్ (Venkatesh), యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) లది సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాళ్లిద్దరి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్), 'ఎఫ్ 3' భారీ విజయాలు సాధించాయి. ఆ రెండిటినీ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు 'దిల్' రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మూడో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఆ సినిమా విడుదల తేదీ గురించి అప్డేట్ ఇచ్చారు.
సంక్రాంతికి వస్తున్నాం... మళ్లీ చెప్పేశారు
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. కానీ, 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranti Ki Vasthunnam) టైటిల్ ఖరారు చేశారని సమాచారం. టైటిల్ మాత్రమే కాదు... సినిమాను కూడా సంక్రాంతికి తీసుకు వస్తున్నారు. ఆ విషయాన్ని ఈ రోజు విడుదల చేసిన వీడియోలో వెల్లడించారు.
వెంకటేష్ సరసన ఐశ్వర్య, మీనాక్షి చౌదరి!
Venkatesh Role In Sankranti Ki Vasthunnam Movie: 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇందులో ఆయన భార్యగా తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా... యువ కథానాయిక మీనాక్షి చౌదరి మరో కథానాయికగా సందడి చేయనున్నారు. ముక్కోణపు క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి హీరో మాజీ ప్రేయసిగా కనిపించనున్నారు.
Also Read: బాబాయ్ పవన్‌లా ఎర్ర కండువా కట్టిన అబ్బాయ్... రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సాంగ్ అప్డేట్ ఇచ్చారోచ్
Team #VenkyAnil3 wishes everyone a very joyful & prosperous #GaneshChaturthi ✨🙏
— Sri Venkateswara Creations (@SVC_official) September 7, 2024
May you celebrate this festive day as joyfully as the team enjoyed on the sets during the shoot 😍#SVC58 Pollachi Schedule completed and EXciting updates soon💥
— https://t.co/ChTrnLnHvn… pic.twitter.com/gHdi6Fhg5W
సంక్రాంతి 2025 బరిలో అగ్ర హీరోలు
ఇప్పటి వరకు సంక్రాంతి పండగ మీద కన్నేసిన సినిమాలు రెండు ఉన్నాయి. ఓ సినిమా 'విశ్వంభర'. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. మరొకటి కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ రెండిటితో పాటు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న సినిమాను సైతం సంక్రాంతి బరిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే, ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు.
వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, 'పమ్మి' సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచయిత - దర్శకుడు: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాత: శిరీష్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, సహ రచయితలు: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ.