అన్వేషించండి

Game Changer Update: బాబాయ్ పవన్‌లా ఎర్ర కండువా కట్టిన అబ్బాయ్... రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సాంగ్ అప్డేట్ ఇచ్చారోచ్

Ram Charan Stills - Game Changer Movie: 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి రామ్ చరణ్ కొత్త స్టిల్ వచ్చింది. మెగా అభిమానులతో పాటు జనసేన పార్టీ శ్రేణులకు సైతం ఈ స్టిల్ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రాజకీయాలకు ఎప్పుడూ దూరమే. జనసేన పార్టీ అధినేత, తన బాబాయ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు మద్దతుగా నిలిచారు. ఎన్నికల సమయంలో పిఠాపురం వెళ్లి అండగా నిలిచారు. అయితే, రాజకీయాల్లోకి రామ్ చరణ్ రాలేదు. ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన పేరు, ఆయన ఫోటో ఒక్కసారిగా రాజకీయ శ్రేణుల్లో సైతం చర్చకు దారి తీశాయి. అందుకు కారణం 'గేమ్ ఛేంజర్' సినిమా.

జనసేన కార్యకర్తలా కండువా కట్టిన రామ్ చరణ్!
వినాయక చవితి సందర్భంగా 'గేమ్ ఛేంజర్' సినిమా యూనిట్ రామ్ చరణ్ కొత్త స్టిల్ విడుదల చేశారు. సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చారు. అయితే, ఆ స్టిల్‌లో నుదుట ఎర్ర కండువా కట్టి రామ్ చరణ్ కనిపించారు. బాబాయ్ పవన్, ఆయన పార్టీ జనసేన కార్యకర్త తరహాలో, ఓ జన సైనికుడిలా చరణ్ కనిపించారని స్టిల్ విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. మెగా అభిమానులతో పాటు జన సైనికులకు ఈ స్టిల్ అమితంగా నచ్చింది. 

సాధారణంగా సినిమాల్లో ఎవరైనా గాజు గ్లాసులో టీ తాగితే... పవన్ కల్యాణ్, జనసేన ప్రస్తావన వస్తోంది. ఎర్ర కండువాను సైతం చాలా మంది జనసేన ఖాతాలో వేస్తూ మాట్లాడుతున్నారు. అటువంటి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎర్ర కండువా కడితే మామూలుగా ఉంటుందా? అదీ సంగతి!

Also Readతమ్ముడికి తారక్ (జూనియర్ ఎన్టీఆర్) వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!

సెప్టెంబర్ నెలలో రెండో పాట వస్తోందోచ్
'గేమ్ ఛేంజర్' రెండో పాట కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ అప్డేట్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో దర్శక నిర్మాతలను నానా మాటలు అన్నారు. బూతులు తిట్టారు. ఓ బూతు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఆ రేంజ్ విమర్శలు వద్దని సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ చేశారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరుకున్న అప్డేట్ వచ్చింది. ఈ నెలలో 'గేమ్ ఛేంజర్' రెండో సాంగ్ విడుదల చేస్తామని చెప్పారు.

Also Readహీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?


క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో 'గేమ్ ఛేంజర్' విడుదల
Game Changer Movie Release Date: 'గేమ్ ఛేంజర్' విడుదల తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, విడుదల ఎప్పుడో చెప్పారు నిర్మాత 'దిల్' రాజు. క్రిస్మస్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం. 


రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ, అంజలి నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటించారు. ఆయన నటనకు పేపర్లు పడతాయని 'దిల్' రాజు చెప్పారు. శ్రీకాంత్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదల కానుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Embed widget