మహేష్ బాబు Vs రవితేజ - 2024 సంక్రాంతికి బిగ్ ఫైట్!
మాస్ మహారాజా రవితేజ 2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగనున్నాడు.
మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. హిట్టు, ప్లాప్స్ తో తో సంబంధం లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు. రీసెంట్ గా 'రావణాసుర' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ఈ దసరాకి 'టైగర్ నాగేశ్వరరావు'గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కాగా ఇప్పుడు తన కొత్త సినిమా ‘ఈగల్’ను రాబోయే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపాడు. రీసెంట్ టైమ్ లో మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమా 'ధమాకా'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో ‘ఈగల్’ మూవీ చేస్తున్నాడు రవితేజ. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాకి 'ఈగల్' టైటిల్‌ను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన టీజర్ వీడియోలో రవితేజ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతన్ని పట్టుకోవడానికి రా ఏజెన్సీ వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఓ వ్యక్తి అతను పత్తి పండించే రైతు అని చెబుతాడు. తనకి ఇంకొన్ని అవతారాలు కూడా ఉన్నాయి. చివరగా రవితేజ ఓ నది దగ్గర నిలబడి పాక్షికంగా ఉన్నతన ముఖాన్ని చూపిస్తారు. ఆ తర్వాత 'ఈగల్' అనే టైటిల్ ని టైటిల్ ని రివీల్ చేశారు. టైటిల్ ప్రజెంటేషన్ లో భాగంగా విడుదలైన ఈ గ్లిమ్స్ వీడియో లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల వంటి తారాగణం కూడా కనిపించారు. కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఇక గ్లిమ్స్ వీడియో లోనే ఈగల్ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సంక్రాంతి బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకుంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జనవరి 13న సంక్రాంతి కానుక విడుదల కాబోతోంది. దీంతో 2024 సంక్రాంతికి రవితేజ - మహేష్ బాబుల మధ్య బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. నిజానికి ఈ ఇద్దరు హీరోలకు సంక్రాంతి సీజన్ మంచి సక్సెస్ ని అందించింది. గతంలో రవితేజ నటించిన 'క్రాక్' సినిమా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవరు' సైతం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈసారి మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' తో పోటీ పడనుంది. మరి ఈ పోటీలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. ఇక 'గుంటూరు కారం' విషయానికొస్తే.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ గ్లిమ్స్ కి అనూహ్య స్పందన లభించింది. 'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎస్,ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: పాన్ వరల్డ్, హాలీవుడ్ సినిమాలు నిర్మించడమే మా లక్ష్యం - టీజీ విశ్వప్రసాద్ ఇంటర్వ్యూ