అన్వేషించండి

Samyuktha Menon: ‘విరూపక్ష’ నటి సంయుక్త మీనన్ పెళ్లి - అందుకేనా సినిమాలకు బ్రేక్?

Samyuktha Menon: బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న తర్వాత కూడా సంయుక్త మీనన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. దీంతో తను పెళ్లి కోసమే సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Samyuktha Menon Wedding: సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి అనేక రకాల రూమర్స్ రావడం కామన్. ఇక అన్నింటికంటే వారి పెళ్లి గురించే రూమర్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఒక మలయాళ ముద్దుగుమ్మ పెళ్లి గురించి కూడా అదే విధంగా ఇండస్ట్రీలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తను మరెవరో కాదు.. ‘భీమ్లా నాయక్’ బ్యూటీ సంయుక్త మీనన్. తెలుగు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకోవడమే కాకుండా.. గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది ఈ భామ. అయినా కూడా వెంటవెంటనే సినిమాలను ఒప్పుకోకుండా, కమిట్మెంట్స్‌కు దూరంగా ఉండడంతో త్వరలోనే సంయుక్త.. పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలపై తన సన్నిహితులు స్పందించారు.

పెళ్లి కోసమే బ్రేక్..?
2022లో విడుదలయిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది సంయుక్త మీనన్. తను టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూనే ఉంది. రెండేళ్లలో తెలుగులో నాలుగు సినిమాల్లో నటించింది సంయుక్త. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దీంతో టాలీవుడ్‌లో తనకు గోల్డెన్ లెగ్ అని ముద్ర పడిపోయింది. ఇక తాజాగా కళ్యాణ్ రామ్‌తో రెండోసారి జోడీకడుతూ ‘డెవిల్’ అనే చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో నైషదా అనే మహారాణి పాత్రలో తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది ఈ మలయాళ బ్యూటీ. అయితే ఇంత గుర్తింపు వచ్చినా కూడా ప్రస్తుతం సంయుక్త చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో తన పెళ్లి కోసం బ్రేక్ తీసుకుందంటూ రూమర్స్ మొదలయ్యాయి.

బిజీ షెడ్యూల్స్ నుండి బ్రేక్..
మామూలుగా హీరోయిన్లకు ఒక్క హిట్ పడితేనే మేకర్స్ అంతా వారి డేట్స్ కోసం క్యూ కడతారు. ఇక గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చిన తర్వాత చాలావరకు నిర్మాతలు హీరోయిన్స్ అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడరు. అయినా కూడా సంయుక్త తన తరువాతి సినిమాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం తన చేతిలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు ఏమీ లేవు. దీన్నిబట్టి చూస్తే.. తన బిజీ లైఫ్ నుండి సంయుక్త బ్రేక్ తీసుకోవాలనుకుంటుందని అర్థమవుతోంది. అది పెళ్లి కోసమే అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే అలాంటిది ఏమీ లేదని తన సన్నిహితులు క్లారిటీ ఇస్తున్నారు. సంయుక్త బిజీ షెడ్యూల్స్ నుండి బ్రేక్ తీసుకోవడం కోసం సినిమాలను ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశారు.

2016లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
సంయుక్త మీనన్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా తన పెళ్లికి సంబంధించిన రూమర్స్ పూర్తిస్థాయిలో ఆగడం లేదు. ఈ విషయంపై తనే స్వయంగా స్పందిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక 2016లోనే ‘పాప్‌కార్న్’ అనే మూవీతో మలయాళంలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన సంయుక్తకు.. 2018 వరకు బ్రేక్ దొరకలేదు. టోవినో థామస్‌తో జోడీకడుతూ సంయుక్త నటించిన ‘థీవండి’తో తను మాలీవుడ్‌లో పాపులర్ అయ్యింది. అంతే కాకుండా తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు కూడా వచ్చాయి. అక్కడే బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో ‘భీమ్లా నాయక్’తో తనకు టాలీవుడ్ ఎంట్రీ దొరికింది. మొదటి సినిమాలోనే స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చెల్లిగా అవకాశం రావడంతో సంయుక్త తన యాక్టింగ్‌తో నిరూపించుకొని.. చాలామంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది.

Also Read: ఫిమేల్ సూపర్ హీరో కూడా ఉంటుంది, ఇది ఇండియాలో జరిగే కథ కాదు - ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget