అన్వేషించండి

Akhanda 2 Thandavam: 'అఖండ 2'లో మరొక హీరోయిన్... బాలకృష్ణకు జోడీగా సంయుక్త

Samyuktha In Akhanda 2: మ్యాన్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ 2 తాండవం'లో మరొక కథానాయికను ఎంపిక చేశారు. ఆవిడ ఎవరంటే?

గాడ్ ‌ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్'తో భారీ విజయం అందుకున్నారు.‌ ఆ సినిమా విడుదలకు ముందే మరొక సినిమాను ఆయన సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. 'సింహా', 'లెజెండ్', 'అఖండ'... తనకు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. 'అఖండ' సీక్వెల్ 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thandavam) ప్రారంభించారు. ఆ సినిమాలో కథానాయిక గురించి ఈ రోజు వివరాలు వెల్లడించారు. 

'అఖండ 2 తాండవం'లో హీరోయిన్ సంయుక్త
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'అఖండ 2 తాండవం'లో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ఎంపిక అయినట్లు సినిమా ప్రారంభోత్సవం రోజున వెల్లడించారు. ఈ సినిమాలో మరొక కీలక పాత్రలో హీరోయిన్ సంయుక్త (Samyuktha) నటిస్తున్నట్లు ఈ‌ రోజు అనౌన్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలో రానా దగ్గుబాటికి జంటగా సంయుక్త నటించారు. తెలుగులో ఆవిడకు తొలి సినిమా అది. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార', ధనుష్ 'సార్', సాయి దుర్గా తేజ 'విరూపాక్ష', కళ్యాణ్ రామ్ 'డెవిల్' వంటి హిట్ సినిమాలు చేశారు. వరుస విజయాలతో జోరు మీద ఉన్న సంయుక్తను బాలకృష్ణ సినిమాలోకి కీలక పాత్రకు ఎంపిక చేశారు దర్శకుడు బోయపాటి. సినిమాలోకి ఆమెను స్వాగతిస్తూ ఇవాళ ఒక పోస్టర్ విడుదల చేశారు.

Also Read'స్కై ఫోర్స్' రివ్యూ: దేశభక్తి సినిమా అక్షయ్‌ కుమార్‌కు హిట్ ఇచ్చిందా? లేదంటే ఇదీ ఫ్లాపుల పరంపరలో చేరుతుందా?

కుంభమేళాలో 'అఖండ 2 తాండవం' చిత్రీకరణ
మహా కుంభమేళాలో 'అఖండ 2 తాండవం' రెగ్యులర్ చిత్రీకరణ చేశారు. 'అఖండ' సినిమా కథ గుర్తు ఉన్నట్లు అయితే... అందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. ఒక అఘోర పాత్ర చేశారు. 'అఖండ 2 తాండవం'లోనూ అఘోర పాత్ర ఉంటుందని, మహా కుంభమేళాలో అఘోరాల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను తీశారని తెలిసింది. 

దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల
'అఖండ 2 తాండవం' చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ సంస్థ మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ప్రగ్యా జైస్వాల్, మరొక నాయికగా సంయుక్త నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. విజయ దశమి సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో 'అఖండ 2 తాండవం' చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రానున్నారు.

Also Read'హిసాబ్ బారాబర్' రివ్యూ: 27 రూపాయల నుంచి 2000 కోట్ల స్కామ్ వరకు - Zee5లో మాధవన్ ఫైనాన్షియల్ థ్రిల్లర్

టాప్ హెడ్ లైన్స్

Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget