Kushi Shooting In Hyderabad : దుర్గం చెరువు దగ్గరలో విజయ్ దేవరకొండ, సమంత
విజయ్ దేవరకొండ, సమంత హైదరాబాదులో షూటింగ్ చేస్తున్నారు. మాదాపూర్, దుర్గం చెరువు దగ్గరలో ఉన్నారు. ఎక్కడ? ఏమిటి? అంటే...
![Kushi Shooting In Hyderabad : దుర్గం చెరువు దగ్గరలో విజయ్ దేవరకొండ, సమంత Samantha Vijay Devarakonda shooting for Shiva Nirvana's Kushi in Madhapur I labs building Kushi Shooting In Hyderabad : దుర్గం చెరువు దగ్గరలో విజయ్ దేవరకొండ, సమంత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/030c19f3b737e5a81adbeafb617b252e1678540272933313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? హైదరాబాదులో! భాగ్య నగరంలో ఎక్కడ? అంటే... దుర్గం చెరువు దగ్గరలో! మాదాపూర్ ఏరియాలో ఇనార్బిట్ మాల్ నుంచి దుర్గం చెరువు వైపు వెళ్లే దారిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో 'ఖుషి' సినిమా షూటింగ్ చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
విజయ్ దేవరకొండ, సమంత జంటగా దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) తెరకెక్కిస్తున్న సినిమా 'ఖుషి' (Kushi Upcoming Movie). ఇటీవల లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. సమంత మయోసైటిస్ బారిన పడటంతో ఈ సినిమా చిత్రీకరణకు కొన్ని రోజుల క్రితం బ్రేక్ పడింది. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు సినిమా సెట్స్ మీదకు వెళుతుందా? అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎదురు చూశారు.
అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున 'ఖుషి' చిత్రీకరణకు సమంత వచ్చారు. అమెజాన్ కోసం రూపొందుతున్న 'సిటాడెల్' వెబ్ సిరీస్ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత మీద సాఫ్ట్‌వేర్ కంపెనీలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
Also Read : చిరంజీవి కాళ్ళ మీద పడిన వేణు - 'బలగం' బృందానికి 'మెగా'స్టార్ ప్రశంసలు
View this post on Instagram
'ఖుషి'లో పీటర్ హెయిన్ ఫైట్స్!
Peter Hein for Kushi : 'ఖుషి' ప్రేమ కథ అని తెలిసిందే. అయితే, ఈ ప్రేమ కథలో ఫైట్స్ కూడా ఉన్నాయ్! ఫేమస్ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆ ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు.
మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ!
ఇటీవల 'ఖుషి' దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana), సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) ను హీరో విజయ్ దేవరకొండ కలిశారు. సినిమాలో సాంగ్స్ ఎలా ఉండాలనేది డిస్కస్ చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు అయ్యాయని చిత్ర బృందం తెలిపింది.
Also Read : వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ గోవింద - రానాను తిడుతున్న నెటిజన్లు
'ఖుషి'ను తొలుత గత ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎందుకు? అనేది ప్రేక్షకులు అందరికీ తెలుసు. అనుకున్న ప్రకారం చిత్రీకరణ జరగలేదు. హీరో విజయ్ దేవరకొండ కూడా 'లైగర్' చిత్రీకరణలో గాయాలు కావడంతో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తే ఎలా ఉంటుందని డిస్కషన్స్ జరిగాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఫిబ్రవరిలో విడుదల అయ్యే ప్రస్తక్తి లేదు. వేసవికి విడుదల కావచ్చని టాక్. అప్పటికి అయినా వస్తుందో? లేదో?
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి 'ఖుషి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)