News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Samantha Vijay Devarakonda : టర్కీ వెళ్లిన సమంత, విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, సమంత టర్కీ వెళ్లారు. శనివారం రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సమంత టర్కీ బయలు దేరుతూ కనిపించారు. 

FOLLOW US: 
Share:

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'ఖుషి' (Kushi Movie). ఇందులో ఆయనకు జోడీగా అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... 

టర్కీలో సాంగ్ షూటింగ్!
'ఖుషి' సినిమాలో ఓ పాటను టర్కీలో చిత్రీకరణ చేయాలని ప్లాన్ చేశారు. సమంత శనివారం రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. టర్కీ బయలు దేరినట్టు తెలిసింది. విజయ్ దేవరకొండ కూడా వెళ్లారట. సినిమాలో ఈ సాంగ్ సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటుందని సమాచారం. ఆల్రెడీ విడుదల చేసిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. 

Also Read : బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్

విజయ్ దేవరకొండ పుట్టినరోజు బహుమతిగా...
విజయ్ దేవరకొండ పుట్టినరోజు (Vijay Devarakonda Birthday) కానుకగా 'ఖుషి'లో తొలి పాట 'నా రోజా నువ్వే...'ను విడుదల చేశారు. మొత్తం ఐదు భాషల్లో ఈ  పాటను విడుదల చేశారు. అప్పుడు విడుదల చేసిన స్టిల్ చూస్తే... కశ్మీరీ ముస్లిం యువతిగా సమంత నటిస్తున్నట్లు అర్థం అవుతోంది.

Also Read నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పించు 'ది ఇండియా హౌస్' - తగలబడిన ఇంటి మిస్టరీ ఏమిటో?

'నా రోజా నువ్వే...'కు తెలుగు సాహిత్యాన్ని దర్శకుడు శివ నిర్వాణ అందించడం విశేషం. ఈ పాటను సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ పాడారు. పాన్ ఇండియా సినిమాగా 'ఖుషి'ని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. పాటను కూడా ఈ ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.  

సరిగమ చేతికి 'ఖుషి' ఆడియో రైట్స్!
'ఖుషి'కి హేషామ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) సంగీత దర్శకుడు. మలయాళంలో ఆయనకు మంచి పేరు ఉంది. సూపర్ హిట్ 'హృదయం' పాటలకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. 'ఖుషి'కి ఆయన సంగీతం అందిస్తున్నారని తెలిసినప్పటి నుంచి... క్రేజ్ నెలకొంది. దానికి తోడు 'ఖుషి' టైటిల్, విజయ్ దేవరకొండ స్టార్ డమ్ తోడు కావడంతో ఫ్యాన్సీ రేటుకు సినిమా ఆడియో రైట్స్ సరిగమ కంపెనీ సొంతం చేసుకుంది.

సమంత పుట్టినరోజు కానుకగా 'ఖుషి' నుంచి చిత్ర బృందం ఓ స్టిల్ విడుదల చేసింది. అందులో ఆమెను చూస్తే... ఐటీ ఉద్యోగి పాత్ర చేస్తున్నారని ఈజీగా చెప్పవచ్చు. కశ్మీరీ యువతి ఐటీ ఉద్యోగి కావడం వెనుక ఏమైనా ట్విస్ట్ ఉందా? లేదా? అనేది సినిమా వస్తే గానీ తెలియదు. మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు 'ఖుషి'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.  

Published at : 28 May 2023 01:18 PM (IST) Tags: Vijay Devarakonda Shiva Nirvana Turkey Kushi Movie Updates Samantha Kushi Songs

ఇవి కూడా చూడండి

Vishal: సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షల లంచం ఇచ్చా - ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నా: విశాల్

Vishal: సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షల లంచం ఇచ్చా - ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నా: విశాల్

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Nayanthara: వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?

Nayanthara: వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?

Ram Charan: ఇండస్ట్రీలో రామ్ చరణ్‌కు 16 ఏళ్లు పూర్తి - స్పెషల్‌గా విష్ చేసిన ఉపాసన

Ram Charan: ఇండస్ట్రీలో రామ్ చరణ్‌కు 16 ఏళ్లు పూర్తి - స్పెషల్‌గా విష్ చేసిన ఉపాసన

వీరాభిమాని మృతి - ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సూర్య

వీరాభిమాని మృతి - ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సూర్య

టాప్ స్టోరీస్

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్

Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్