Samantha: అప్పుడలా, ఇప్పుడిలా - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత, ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్
సమంత ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ సమయంలో తను చేసిన యాడ్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలావరకు నటీనటులు ముందుగా మోడల్‌గా తమ కెరీర్‌ను ప్రారంభించిన తర్వాతే.. వెండితెరపై హీరోహీరోయిన్లుగా మారుతారు. కొందరు ముందుగా మోడలింగ్, ఆ తర్వాత బుల్లితెర, ఆ తర్వాత వెండితెర అనే ప్రక్రియను ఫాలో అవుతారు. ఇప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత కూడా దాదాపుగా ఇదే ప్రక్రియను ఫాలో అయ్యినట్టు తెలుస్తోంది. ముందుగా తన కాలేజ్ సమయంలోనే మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది సమంత. ఆ తర్వాత పలు యాడ్స్‌లో నటించింది. అదే సమయంలో తనకు ఒక తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం రావడంతో తన కెరీర్ టర్న్ అయిపోయింది. తాజాగా సమంత.. తన కెరీర్ మొదట్లో యాడ్స్ చేస్తున్న సమయంలో ఎలా ఉండేదో ఒక వీడియో వైరల్ అయ్యింది. దీంతో సామ్.. అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది అని పోల్చి చూడడం మొదలుపెట్టారు.
అప్పట్లో అలా..
ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ వరల్డ్‌లో సమంత.. మకుటం లేని మహారాణిగా వెలిగిపోతోంది. అందంలోనే కాదు.. అభినయంలో కూడా సమంత.. తరువాతి ప్యాన్ ఇండియా స్టార్ అని ఫ్యాన్స్ ఎప్పుడో సర్టిఫికెట్ ఇచ్చారు. చివరిగా ‘ఖుషి’ చిత్రంలో నటించింది సమంత. విజయ్ దేవరకొండతో తను జతకట్టిన ‘ఖుషి’.. మంచి టాక్‌ను సాధించడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కూడా పరవాలేదనిపించింది. ఆ తర్వాత సామ్ కెరీర్ అప్డేట్ ఏంటి అని ఇంకా తెలియదు. తనకు ఉన్న మయాసిటీస్ వ్యాధికి సంబంధించిన చికిత్స కోసం విదేశాలు వెళ్తుందని, సంవత్సరం పాటు బ్రేక్ తీసుకోనుంది అని సమంత సైతం పరోక్షంగా తెలియజేసింది. ఇంతలో సమంత.. మోడలింగ్ చేస్తున్నప్పుడు నటించిన ఒక యాడ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అప్పటినుండి ‘ఖుషి’ వరకు సమంలో వచ్చిన మార్పుల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
‘ఏమాయ చేశావే’లో సమంత అందమే వేరు..
సమంత.. ముందుగా ‘ఏమాయ చేశావే’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అంతకంటే ముందు ఒకట్రెండు తమిళ చిత్రాల్లో నటించింది. కానీ ‘ఏమాయ చేశావే’లో జెస్సీగా మొదటి సినిమాతో, మొదటి క్యారెక్టర్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు సమంత.. తన ముక్కుకు కాస్మటిక్ సర్జరీ చేయించింది అన్నట్టుగా వార్తలు వినిపించాయి. దానికి తగినట్టుగా తన మొహంలో ఎన్నో మార్పులు కూడా కనిపించాయి. ‘ఏమాయ చేశావే’తో పోలిస్తే సమంత.. ఎప్పటికప్పుడు తన లుక్‌ను మారుస్తూనే వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన పెదవులకు కాస్మటిక్ సర్జరీ చేయించుకోవడంతో జెస్సీ పాత్రలో కనిపించినంత క్యూట్‌గా సమంత ఇప్పుడు కనిపించడం లేదంటూ ఆమెపై ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.
సమంత మాత్రమే కాదు.. నయనతార కూడా..
కేవలం సమంత మాత్రమే కాదు.. నయనతార లాంటి స్టార్ హీరోయిన్ కూడా తన మోడలింగ్ రోజుల్లో కాస్త డిఫరెంట్‌గానే ఉండేది. వారు మోడలింగ్ చేస్తూ యాడ్స్ చేస్తున్న సమయంలో కొంచెం వింతగా ఉన్నా నేచురల్ బ్యూటీలుగా ఉండేవారని, కానీ కాస్మటిక్ సర్జరీలతో తమ మొహాలలో జీవం పోయేలా చేసుకుంటున్నారని ఫ్యాన్స్ వాపోతున్నారు. ‘ఏమాయ చేశావే’ సమయంలోనే సమంత పెదవులు అందంగా ఉన్నాయని, సర్జరీ తర్వాత మెల్లమెల్లగా తన పెదవుల వల్ల తన మొహంలో అందం పోయిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక తాజాగా విడుదలయిన ‘ఖుషి’లో చాలా ఫ్రేమ్స్‌లో సమంత అసలు సమంతలాగానే లేదని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత - ఇదిగో ప్రూఫ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial