అన్వేషించండి

మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత - ఇదిగో ప్రూఫ్!

సమంత, నాగచైతన్య మళ్ళీ కలవబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు దీని గురించి తెగ డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజన్లు.

అక్కినేని హీరో నాగచైతన్య, సమంత మళ్ళీ కలవబోతున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం నెట్టింట దీని గురించే తెగ డిస్కషన్ నడుస్తోంది. అందుకు కారణం తాజాగా జరిగిన ఓ సంఘటనే. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయిన నాలుగేళ్లకే మనస్పర్ధలు కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవర్ లైఫ్ వారు చూసుకొని సింగిల్ గా లీడ్ చేస్తున్నారు. కెరీర్ పరంగా ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే సమంతకి పెట్స్ అంటే చాలా ఇష్టం అనే విషయం తెలిసిందే కదా.

చైతూ తో కలిసినప్పుడు 'హష్' అనే ఒక కుక్క పిల్లని పెంచుకుంది సమంత. ఆ కుక్కపిల్ల నిత్యం వారితోనే ఉండేది. సమంతకి ఆ కుక్క పిల్ల అంటే చాలా ఇష్టం. అందుకే విడాకుల తర్వాత కూడా ఆ కుక్క పిల్లని సమంత తనతో పాటే తీసుకొని వెళ్ళిపోయింది. చైతూకి కూడా ఆ కుక్క పిల్ల అంటే ప్రత్యేకమైన అభిమానం. అయితే సమంత మాత్రం తాను పెంచుకున్న పెట్స్ అన్నిటిని కూడా విడాకుల తర్వాత తనతోనే తీసుకొచ్చేసింది. అప్పుడప్పుడు తన పెంపుడు కుక్కలతో ఫోటోలు దిగి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సమంత దగ్గర ఉన్న కుక్కపిల్ల నాగచైతన్య దగ్గర కనిపించింది.

ఓ అభిమాని తను కొన్న స్పోర్ట్స్ బైక్ ని నాగచైతన్యను చూపించడానికి తీసుకెళ్లగా చైతు ఆ బైక్ ని టెస్ట్ డ్రైవ్ కూడా చేశాడు. ఆ సమయంలోనే చైతూతో పాటే 'హష్' కనిపించింది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంత దగ్గర ఉన్న పెట్ డాగ్ చైతూ దగ్గరికి ఎలా వచ్చింది? అనే ప్రశ్నలు నెటిజన్స్ నుంచి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది నైటిజన్స్ సమంత, చైతు ఇద్దరు కలవబోతున్నారని చెబుతున్నారు. ఇద్దరూ తమ గొడవలను పక్కనపెట్టి మళ్ళీ కలుస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం నాగచైతన్య, సమంత కలిసే ఆ ఆ పెట్ డాగ్ ని తీసుకొచ్చి పెంచుకున్నారని, ఈ క్రమంలోనే సమంత ఆ పెట్ డాగ్ ని అప్పుడప్పుడు చైతు ఇంటికి పంపిస్తుంటుందని అంటున్నారు.

అయితే ఇందులో ఏది వాస్తవం అనే విషయం ప్రస్తుతానికి తెలియకపోయినా సమంత పెట్ డాగ్ నాగచైతన్య దగ్గర ఉండటంతో త్వరలోనే ఈ ఇద్దరు కలవబోతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. సమంత ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. 'ఖుషి' మూవీ తర్వాత మరే సినిమాకి కమిట్ అవలేదు. విదేశాల నుంచి తిరిగి వచ్చాక నిజంగానే సమంత చైతూను కలుస్తుందా? నిజంగా కలిస్తే అంతకంటే హ్యాపీ మూమెంట్ మరొకటి లేదంటూ అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ఇక చైతూ విషయానికొస్తే.. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి ఈ మూవీలో చైతుకి జోడిగా నటిస్తోందిమ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

Also Read : తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు - స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Book A APSRTC Ticket In AP Whatsapp Governance: ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
AP WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
SSMB 29 TITLE: ఏంటీ NT NINE..?  మహేష్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ అదేనా..? ప్రియాంక చోప్రా ఫోటోలతో రచ్చ రచ్చ
ఏంటీ NT NINE..? మహేష్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ అదేనా..? ప్రియాంక చోప్రా ఫోటోలతో రచ్చ రచ్చ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO 100th Launch Journey | సైకిల్ మీద తిప్పలు, ఎడ్ల బండి మోతలు..అన్నీ దాటి ఈ రోజు సెంచరీ | ABP DesamMaha Kumbh 2025 Prayag Raj Drone VisualsMaha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP DesamCM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Book A APSRTC Ticket In AP Whatsapp Governance: ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
AP WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
SSMB 29 TITLE: ఏంటీ NT NINE..?  మహేష్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ అదేనా..? ప్రియాంక చోప్రా ఫోటోలతో రచ్చ రచ్చ
ఏంటీ NT NINE..? మహేష్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ అదేనా..? ప్రియాంక చోప్రా ఫోటోలతో రచ్చ రచ్చ
Maha Kumbh: 27 ఏళ్ల కింద వదిలేసిపోయిన భర్తను కుంభమేళాలో చూసిన భార్య -  అఘోరిగా ఉన్న ఆ భర్త ఏం ఏం చేశాడో తెలుసా ?
27 ఏళ్ల కింద వదిలేసిపోయిన భర్తను కుంభమేళాలో చూసిన భార్య - అఘోరిగా ఉన్న ఆ భర్త ఏం ఏం చేశాడో తెలుసా ?
Monalisa News: సినిమాలో నటించేందుకు మోనాలిసా ఓకే- ముంబైలో యాక్టింగ్‌ ట్రైనింగ్ 
సినిమాలో నటించేందుకు మోనాలిసా ఓకే- ముంబైలో యాక్టింగ్‌ ట్రైనింగ్ 
Kannappa First Half Review: 'కన్నప్ప' ఫస్టాఫ్ చూసిన రైటర్ బీవీఎస్ రవి - విష్ణు మంచు సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'కన్నప్ప' ఫస్టాఫ్ చూసిన రైటర్ బీవీఎస్ రవి - విష్ణు మంచు సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
Viral videos: క్లాస్ రూమ్‌లో విద్యార్థిని పెళ్లాడిన ప్రొఫెసర్ - అంతా సైకాలజీ ప్రాక్టికల్స్ అట - నమ్మేద్దామా ?
క్లాస్ రూమ్‌లో విద్యార్థిని పెళ్లాడిన ప్రొఫెసర్ - అంతా సైకాలజీ ప్రాక్టికల్స్ అట - నమ్మేద్దామా ?
Embed widget