Samantha: సమంత సర్కస్ ఫీట్లు - ఇదేం పార్టీ సామ్? ఈ వైరల్ వీడియో చూశారా?
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన వర్కౌట్ వీడియోకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సమంత ఇండస్టీకు వచ్చి దశాబ్ద కాలం పైనే అవుతోంది. అయినా ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకుపోతోందీ బ్యూటీ. అయితే వరుసగా షూటింగ్ లలో పాల్గొనడం ఈ మధ్య తన ఆరోగ్యం కాస్త క్షీణించడంతో కొన్నాళ్ళు సినిమాలకు విరామం ఇచ్చి తన వ్యక్తిగత జీవితం ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట సమంత. అందుకే వెంటనే తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేసి సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇటీవల సమంత జిమ్ క్లబ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.
సాహసోపేత స్టంట్స్ చేస్తూ కనిపించిన సమంత
సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాత సమంత ఎక్కువగా ఆథ్యాత్మిక చింతనలో గడుపుతోంది. గతంలో తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించింది సమంత. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీసెంట్ గా కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. తాజాగా మరోసారి సమంత మరో వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అయితే అది ఆధ్యాత్మిక వీడియో కాదు. ఇటీవల ఇండోనేషియా బాలికి వెళ్లిన సామ్ అక్కడ జిమ్ క్లబ్ లో వర్కౌట్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోలో నేల మీద పడుకున్న సమంత ఓ వ్యక్తినే తన కాళ్లు, చేతుల సాయంతో గాల్లో నిలబెడుతూ బ్యాలెన్స్ చేస్తూ యాక్రోబాటిక్ స్టంట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. దానికి ‘‘క్లబ్ లో మేం ఇలాగే పార్టీ చేసుకుంటాం’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. సమంత చేసిన సాహసోపేత స్టంట్ లు చూసి ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలి ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న సమంత ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ ఉంటోంది.
సమంత ఫీట్లను ఈ వెబ్ స్టోరీలో చూడండి
మయోసైటిస్ ట్రీట్మెంట్ కు అమెరికా వెళ్లనుందా?
సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. సుధీర్ఘకాలం పాటు దానికి ట్రీట్మెంట్ తీసుకుంది. అయినా ఇప్పటికీ తనను ఆ వ్యాధి వేధిస్తోందట. అందుకే దీనిపై పూర్తి శ్రద్ధ పెట్టి పూర్తిగా కోలుకోవాలని భావిస్తోందట సామ్. అందుకే చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసేసింది. ముందుగా తీసుకున్న అడ్వాన్సులన్నీ వెనక్కి తిరిగిచ్చేసిందని టాక్. ఇకపై తన ఆరోగ్యం పై పూర్తిగా కేర్ తీసుకోవాలని చూస్తుందట. ఇందులో భాగంగానే మయోసైటిస్ కు మెరుగైన చికిత్స కోసం సమంత త్వరలో అమెరికా వెళ్లనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే సమంత మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి వస్తుంది అనే విషయం చెప్పలేదు. దాదాపు ఏడాదికి పైగానే సమంత సినిమాలకు దూరంగా ఉంటుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి సమంత మళ్లీ తెరపై ఎప్పుడు మెరుస్తుందో వేచి చూడాలి.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ మేకర్స్ - మూవీ రిలీజ్ డేట్ మారిపోయిందా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial