Samantha Divorce: ఆ విషయాలను ఎప్పటికీ మరిచిపోవాలని అనుకోవడం లేదు - చైతూతో విడాకులపై సమంత కామెంట్స్?
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంతల విడాకుల వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తన జీవితంలో జరిగిన ఏ విషయాన్నీ మరచిపోవాలనుకోవడం లేదని సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Samantha : టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిపోయిన సమంత.. రీసెంట్ గా తమ వైవాహిక బంధంపై పలు కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి తమ విడాకుల అంశంపై స్పందించిన సామ్.. నాగ చైతన్యతో విడాకుల విషయాన్ని మరచిపోవాలనుకోవడం లేదని భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే తన జీవితంలో జరిగిన ప్రతీదీ ఏదో ఒక పాఠం నేర్పిందంటూ సమంత ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
సినీ నటులు సమంత రూత్ ప్రభు, నాగ చైతన్యలు 2017లో ప్రేమ వివాహం చేసుకోవడంతో ఎంతో మంది ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. వారిద్దరి జంటను చూసి మురిసిపోయారు. తాము కూడా అలాగే ఉండాలని ఆ కపుల్ ను చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకున్నారు కూడా. కానీ సినీ తారల్లో ఈ మధ్య కామన్ గా మారిపోయిన విడాకులు అన్న వివాదం వారి మధ్యలోనూ చిచ్చురేపుతుందని ఎవరూ ఊహించలేదు. అకస్మాత్తుగా నాగ చైతన్యకు సంబంధించిన ఫొటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో నుంచి సమంత తీసేయ్యడం, ఆమెకు పేరులో ఉన్న అక్కినేని అనే పేరును తొలగించడం అప్పట్లో పలు చర్చలకు దారితీసింది. వాళ్లిద్దరూ విడిపోయారన్న వార్తలు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.
ఈ క్రమంలోనే పెళ్లైన నాలుగేళ్ల తర్వాత అంటే 2021లో సమంత, నాగ చైతన్యల విడాకుల విషయం తెరపైకి వచ్చింది. అప్పటివరకూ వస్తోన్న రూమర్స్ కు ఇరువరి కుటుంబసభ్యులు గానీ, వారిద్దరిలో ఏ ఒక్కరు గానీ సమాధానం ఇవ్వలేదు. పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ వాళ్లిద్దరూ విడిపోతున్నట్టు, విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించలేదు. అప్పటివరకూ ఓ రూమర్ ఉన్న ఆ వార్త కాస్తా నిజమైంది. సోషల్ మీడియా వేదికగా సామ్, చైలు తామిద్దరూ విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో వారిద్దరి ఫ్యాన్స్ తీవ్ర దిగ్ర్భాంతికి, నిరాశకు లోనయ్యారు. మళ్లీ వారిద్దరూ కలుస్తారని మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ అలాంటిదేం జరగలేదు. ఎవరి దారిన వారు వెళ్లిపోయి, ఎవరి లైఫ్ లో వాళ్లు బతుకుతున్నారు.
కానీ రీసెంట్ గా మళ్లీ సామ్, చైతన్యల విడాకుల వివాదం మళ్లీ వార్తల్లో ట్రెండింగ్ గా నిలుస్తోంది. సమంత లేటెస్ట్ చిత్రం 'శాకుంతలం' త్వరలోనే విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ.. వాటిల్లో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘పుష్ప’ సినిమాలో తాను ఐటెం సాంగ్ చేయడంపై స్నేహితులు, కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అప్పటికే తమ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయన్న ఆమె.. తాను తన వైవాహిక బంధంలో తన సైడ్ నుంచి 100 శాతం ఇచ్చినా వర్కవుట్ కాలేదని సంచలన కామెంట్స్ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. మీరు మీ జీవితంలో మరచిపోవాలనుకునే ఏదైనా ఉందా అని అడిగి ప్రశ్నకు సమాధానంగా.. తాను తన జీవితంలో జరిగిన ఏ విషయాన్నీ మరచిపోవాలనుకోవడం లేదని ఆన్సర్ ఇచ్చింది. ఇది చెప్పడానికి తానేం ఇబ్బంది పడడం లేదన్న ఆమె.. ఇంకా గట్టిగా చెప్పాలా అంటూ సమాధానమిచ్చింది. ఈ ప్రశ్నకు తాను సమాధానం చెప్పనని, కానీ ప్రతిదీ గుర్తుంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే తన జీవితంలో జరిగిన ప్రతిదీ తనకు పాఠం నేర్పిందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇదిలా ఉండగా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సమంత తాజా చిత్రం 'శాకుంతలం' ట్రైలర్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కొత్త విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుందని ప్రకటించారు. ఈ మూవీని 2D తో పాటు 3Dలోనూ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రంలో సమంతతో పాటు, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో నటించగా.. పౌరాణిక రొమాంటిక్ డ్రామా 'కాళిదాసు' రచించిన ప్రముఖ నాటకం శకుంతల కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.