అన్వేషించండి

Maa Inti Bangaram Collections : మా ఇంటి బంగారం మరో రికార్డు - ఓవర్సీస్‌లో గోల్డెన్ నెంబర్

Maa Inti Bangaram : సమంత మా ఇంటి బంగారం ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తుండగా... త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరనుంది.

Samantha's Maa Inti Bangaram New Record In North America : స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకూ రూ.92 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లోనూ అదే జోష్ కంటిన్యూ కాగా... తాజాగా మరో రికార్డు అధిగమించింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?

జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మా ఇంటి బంగారం' నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ దాటేసింది. అక్కడ ఈ మూవీ రిలీజ్ చేసిన ప్రత్యాంగిర సినిమాస్ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. తెలుగులో సోలో ఫీమేల్ లీడ్ మూవీగా రూపొందించిన మూవీ...  ఉత్తర అమెరికాలో ఈ స్థాయిలో రికార్డు కలెక్షన్స్ సాధించడం ఇదే ఫస్ట్ టైం అని వెల్లడించింది.

ఇక, ఇండియావ్యాప్తంగా దాదాపు రూ.67 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్... రూ.48 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. త్వరలోనే వరల్డ్ వైడ్ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సమంత కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది.

Also Read : GDN Trailer Review : మిరాకిల్ మ్యాన్‌గా మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ లైఫ్ స్టోరీ... ట్రైలర్ చూశారా?

ఈ మూవీకి సమంత ఫ్రెండ్ నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... సమంత భర్త రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, మంజూష, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సమంత సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు నిర్మించారు.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'మా ఇంటి బంగారం' ఓటీటీ స్ట్రీమింగ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సినిమా డిజిటల్ రైట్స్ జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా... జులై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

స్టోరీ ఏంటంటే?

చిన్నప్పుడే తల్లిదండ్రును కోల్పోయిన స్వర్ణ (సమంత) అనాథాశ్రమంలో పెరుగుతుంది. ఆ తర్వాత పెద్దింటి అబ్బాయి అనిరుధ్ (దిగంత్)ను పెళ్లి చేసుకుంటుంది. తమకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు అనిరుధ్‌ను అతని ఫ్యామిలీ దూరం పెడుతుంది. దీంతో అతన్ని తిరిగి ఫ్యామిలీకి దగ్గర చేయాలని స్వర్ణ అనుకుంటుంది. చెల్లి పెళ్లికి భర్తతో అతని ఊరికి  వెళ్లిన స్వర్ణ మంచి కోడలిగా పేరు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంది.

ఇందు కోసం తన చిన్న నాటి ఫ్రెండ్ కిరణ్మయి (మంజూష) సాయం తీసుకుంటుంది. అయితే, అనుకోకుండా స్వర్ణను ఆమె గతం వెంటాడుతుంది. దీంతో ప్యామిలీకి ఇబ్బందులు ఎదురవుతాయి. అసలు స్వర్ణ ఎవరు? ఆమె జీవితంలో కరుణ (గుల్షన్ దేవయ్య) పాత్ర ఏంటి? శత్రువుల నుంచి తన ఫ్యామిలీని స్వర్ణ ఎలా కాపాడుకుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Rao Bahadur Collections Day 2 : రావు బహదూర్ రెండు రోజుల కలెక్షన్స్ - బాక్సాఫీస్ వద్ద అదే జోష్... ఓవర్సీస్‌లో ఎంతంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget