Samantha : Fight Like A Girl అంటోన్న సమంత.. నాగ చైతన్య పెళ్లి సందర్భంగా వైరల్ అవుతున్న పోస్ట్, ఇన్‌డైరక్ట్‌గా వారికి కౌంటర్ ఇవ్వలేదుగా
Samantha Insta Story : సోషల్ మీడియాలో సమంత పెట్టిన ఓ స్టోరి ఇప్పుడు వైరల్‌గా మారింది. Fight Like A Girl అంటూ పెట్టిన పోస్ట్‌పై నెటిజన్లు తెగ చర్చిస్తున్నారు ఎందుకంటే..
Samantha's Instagram Story on Naga Chaitanya's Wedding Day : స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే రీసెంట్గా ఆమె తండ్రి చనిపోయిన తర్వాత ఆమె పెద్ద యాక్టివ్‌గా ఉండట్లేదు. అయితే ఈరోజు మాత్రం మళ్లీ ఇన్‌స్టాలోకి వచ్చింది సమంత. Fight Like A Girl అంటూ ఓ వీడియోను ఇన్‌స్టా స్టోరిలో పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమె ఎక్స్ హజ్బెండ్ నాగచైతన్య, శోభితల పెళ్లి మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ సమయంలో సామ్ పోస్ట్ చేసిన వీడియో, హ్యాష్ ట్యాగ్ అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే..
రీల్లో ఉన్నది ఇదే
సమంత ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రీల్లో.. ఓ అమ్మాయి, అబ్బాయి కుస్తీ పడుతుంటారు. అయితే అబ్బాయిలో ఓడించేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అమ్మాయి కాస్త భయంగానే బరిలోకి దిగుతుంది. కానీ చివరికి అమ్మాయే గెలుస్తుంది. దీంతో ఓడిపోయిన అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఈ వీడియోను షేర్ చేసి.. దానికి సమంత Fight Like A Girl అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది.
View this post on Instagram
నెటిజన్ల క్యూరియాసిటీ
నాగచైతన్య, శోభితల పెళ్లి నేపథ్యంలో సమంత ఏమి పోస్ట్ పెడుతుందా అనే క్యూరియాసిటీ నెటిజన్లలో ఉంది. అయితే ఆమె షేర్ చేసిన ఈ వీడియోను, పెట్టిన హ్యాష్ ట్యాగ్‌ను స్క్రీన్ షాట్ తీసి.. దానిని మీమ్స్ వేస్తున్నారు. ఎవరికైనా ఇన్డైరక్ట్ కౌంటర్ ఇస్తున్నావా? సామ్ అని కొందరు పోస్ట్ చేస్తుంటే.. మరికొందరు కావాలనే ఈ పోస్ట్ పెట్టిందంటూ సోషల్ మీడియాలో మినీ యుద్ధమే చేసుకుంటున్నారు.
Also Read : నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
స్టోరి పెట్టింది అందుకేనా?
సమంత ఇలాంటి పోస్ట్‌లు షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడే ఎందుకింత క్రేజ్ అంటే.. మరికొద్ది గంటల్లో ఆమె మాజీ భర్త నాగచైతన్య వివాహం జరుగుతుంది. అందుకే సమంత ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు భావిస్తున్నారు. హీరో, హీరోయిన్గా సినిమా చేసి, ఫ్రెండ్స్‌గా మారి.. ఆ జర్నీలో ప్రేమలో పడ్డారు సమంత, నాగచైతన్య. తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. టాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా కొన్నాళ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అయితే లాక్డౌన్ తర్వాత విడిపోతున్నట్లు తెలిపారు.
విడాకుల తర్వాత..
విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య వారి సినిమాలు, సిరీస్‌లలో బిజీగా ఉన్నారు. సమంత తన హెల్త్, పర్సనల్ లైఫ్, సినిమాలపై ఫోకస్ పెట్టింది. చై కూడా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు వెళ్తున్నారు. అయితే నాగచైతన్య ఫ్యామిలీ లైఫ్‌ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడిన ఆయన.. ఆగస్టులో ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈరోజు(డిసెంబర్ 4,2024)న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారి పెళ్లి జరగనుంది.
Also Read : CTRL రివ్యూ ఇచ్చేసి.. అనన్య నటనను పొగిడేసిన సమంత.. ఆ ఓటీటీ సినిమాని చూసి యాప్స్ డిలేట్ చేసేందట