అన్వేషించండి

CTRL Movie Review : CTRL రివ్యూ ఇచ్చేసి.. అనన్య నటనను పొగిడేసిన సమంత.. ఆ ఓటీటీ సినిమాని చూసి యాప్స్ డిలేట్ చేసేందట

CTRL Review : హీరోయిన్ సమంత.. తనకి ఏదైనా సినిమా నచ్చితే దాని గురించి కచ్చితంగా ప్రమోట్ చేస్తుంది. తాజాగా అనన్యపాండే పాండే నటించిన CTRL సినిమాకు అదిరే రివ్యూ ఇచ్చింది.

Samantha On Ananya Panday's CTRL Movie : ఈ మధ్య హీరోలు కానీ.. హీరోయిన్లు కానీ తమ సినిమాలనే కాకుండా.. ఇతర సినిమాలకు కూడా రివ్యూ ఇచ్చి ప్రమోట్ చేస్తూ బాలీవుడ్, టాలీవుడ్ వంటి బేధాలు లేకుండా ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా కొందరు స్టార్ సెలబ్రెటీలు కొన్ని సినిమాలు చూసి.. వాటికి సోషల్ మీడియా ద్వారా రివ్యూలు ఇస్తారు. అలాంటివారిలో సమంత కూడా ఒకరు. ఈ భామ తను ఏ సినిమా చూసినా.. దానికి సంబంధించి మినీ రివ్యూ ఇచ్చేస్తుంది. తాజాగా CTRL సినిమాకు రివ్యూ(CTRL Movie Review) ఇచ్చింది సమంత. హీరోయిన్​ నటన గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పేసింది. 

నెట్​ఫ్లిక్స్ వేదికగా వచ్చిన CTRL సినిమా గురించి సమంత రివ్యూ ఇచ్చింది. Highly recommend amd a must watch #CTRL. It is Gripping from start to finish and exceptionally wellmade. @ananyapanday yo beauty, your performance was outstanding. It made me quickly grab my phone and uninstall several apps. congratulations team #CTRL అంటూ రాసుకొచ్చింది. సినిమాలో అనన్య పాండే నటన చాలా బాగుందంటూ.. అందరూ సినిమాను చూడాలని ఇన్​స్టాస్టోరిలో పోస్ట్ చేసింది. అలాగే సినిమా చూసి తన మొబైల్​లోని కొన్ని యాప్స్ అన్​ఇన్​స్టాల్ చేసినట్లు సమంత తెలిపింది. ఇంతకీ సినిమాలో అంత డేంజర్ సబ్జెక్ట్ ఏముంది?

CTRL కథ ఇదే

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అత్యంత సున్నితమైన విషయాన్నే ప్రధాన అంశంగా తీసుకున్నారు మేకర్స్. సోషల్ మీడియా, AI, యాప్స్ ఈ జెనరేషన్​ని ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో చెప్తూ.. సినిమాను తెరకెక్కించారు. సోషల్ మీడియాలో ఇన్​ఫ్లూయెన్సర్​గా ఉండేందుకు తెరవెనుక ఎలాంటి కష్టాలు పడుతున్నారో.. పర్సనల్​ లైఫ్​ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో.. AIని మోతాదుకు మించి వాడితే ఏమవుతుందో వంటి విషయాలను వివరించే ప్రయత్నం చేశారు. 

కథ ఎలా సాగుతుందంటే..

నీలా (అనన్య పాండే), జోయ్ (విహాన్). వీరిద్దరూ కాలేజ్​ ఫెస్ట్​లో కలుసుకుంటారు. లవ్​లో పడతారు. వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంజాయ్ అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్​ చేస్తూ.. సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్స్​గా మారుతారు. బ్రాండ్స్​ కూడా వీరిని ప్రమోట్ చేస్తూ ఉంటాయి. లివిన్ రిలేషన్​లో ఉంటూ లగ్జరీ లైఫ్​ని లీడ్ చేస్తారు. అయితే నీలా ఓరోజు.. జోయ్​కు బర్త్​డే సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు వెళ్లేసరికి ఓ షాక్​ తగులుతుంది. దీంతో వీరి సోషల్ మీడియా లైఫ్​కు బ్రేక్ వస్తుంది. 

ఈ బ్రేక్​నుంచి బయటకు వచ్చేందుకు నీలా AI సపోర్ట్ తీసుకుంటుంది. మళ్లీ బ్రాండ్స్​ తనదగ్గరికి వచ్చేందుకు.. సోషల్ మీడియాలో మళ్లీ సెలబ్రెటీ అయ్యేందుకు, కొన్ని విషయాలు మరచిపోయేందుకు AIకి తన యాక్సెస్​ ఇస్తుంది. ఆ AI నీలాకి ఎలా హెల్ప్ చేసింది. దానివల్ల జరిగిన అతిపెద్ద నష్టమేమిటి? జోయ్​ ఏమయ్యాడు? మొబైల్​లో యాప్స్​ డౌన్​లోడ్ చేసేప్పుడు జాగ్రత్తగా లేకుంటే జరిగే నష్టమేమిటి? వంటి విషయాలను సినిమాలో చూడాల్సిందే. 

ఫ్యామిలీతో చూడొచ్చా?

నీలా పాత్రలో అనన్య బాగా ఆకట్టుకుంది. గతంలో కంటే మెరుగైన, మెచ్యూర్డ్ పర్​ఫార్మెన్స్​తో ఆకట్టుకుంది. జోయ్​గా విహాన్​ కూడా పరిధిమేర బాగా నటించారు. సినిమా అంతా సోషల్ మీడియా, AI చుట్టే ఎక్కువ తిరుగుతుంది. పర్సనల్ డేటా ఎలా మిస్​యూజ్​ అవుతుందనే విషయాన్ని సినిమాలో బాగా చూపించారు. టీనేజర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఇది కూడా ఒకటనే చెప్పవచ్చు. మొత్తంగా సినిమా సింపుల్​గా, నార్మల్​గా ఉంటూనే రియాలిటీని కళ్లముందు చూపిస్తుంది. వీకేండ్ సమయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో ఈ సినిమాను చూడొచ్చు. 

Also Read : 'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా... శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యంమామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసనబ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీసీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ABP Southern Rising Summit 2024 : సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
KTR News: కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
Vasireddy Padma : జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
Embed widget