Salman Khan: చావుకు వీసా అవసరం లేదు - సల్మాన్ ఖాన్ సన్నిహితులకూ బెదిరింపులు, సల్లూ భాయ్ సెక్యూరిటీ పెంపు
Lawrence Bishnoi : సల్మాన్ ఖాన్‌పై ఎప్పటినుండో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నాయ్ ఫోకస్ ఉంది. తాజాగా మరోసారి చంపేస్తానంటూ ఈ హీరోకు బెదిరింపులు రావడంతో బిష్నాయే చేశాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Salman Khan : బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ ఎప్పటినుంచో బెదిరింపులను ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల అవి మరింత ఎక్కువయ్యాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నాయ్ నుంచి సల్మాన్‌కు ప్రమాదం ఉందని ప్రేక్షకులకు తెలిసిన విషయమే. కానీ తాజాగా లారెన్స్ దగ్గర నుంచి సల్మాన్‌కు మరో హెచ్చరిక వచ్చింది. దీంతో ఈ హీరో సెక్యూరిటీని మరింత పటిష్టం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఫేస్‌బుక్ పోస్ట్‌తో బెదిరింపులు..
సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ మంగళవారం రివ్యూ చేశారు ముంబాయ్ పోలీసులు. ఎందుకంటే ఒక ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి సల్మాన్ ఖాన్‌కు ఒక ఇన్‌డైరెక్ట్ హెచ్చరిక వచ్చింది. అది లారెన్స్ బిష్నాయ్ అని కచ్చితంగా చెప్పలేకపోయినా.. ఇది ఆ గ్యాంగ్‌స్టర్ పనే అయ్యిండొచ్చని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆ ఫేస్‌బుక్ అకౌంట్‌కు డీపీగా బిష్నాయ్ ఫోటో ఉండడమే పోలీసుల అనుమానానికి కారణం. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణ కొనసాగుతుండగా.. ప్రస్తుతం బిష్నాయ్ జైలులో ఉన్నాడు. అయినా కూడా సల్మాన్ ఖాన్‌పై ఎప్పుడూ కన్నేసి ఉంచాడనేది సమాచారం.
చావు పిలవకుండానే వస్తుంది..
ఇటీవల పంజాబీ సింగర్ గిప్పీ గ్రేవాల్‌ను ఉద్దేశిస్తూ ఒక ఫేస్‌బుక్ పోస్ట్ బయటికొచ్చింది. ఆ పోస్ట్‌లో సల్మాన్ ఖాన్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ‘‘నువ్వు సల్మాన్ ఖాన్‌ను అన్నలాగా భావిస్తావు కదా. కానీ ఇప్పుడు నీ అన్న బయటికి వచ్చి నిన్ను కాపాడాల్సిన సమయం వచ్చేసింది. ఈ మెసేజ్ సల్మాన్ ఖాన్‌కు కూడా - దావూద్ వచ్చి నిన్ను కాపాడతాడని అనుకోకు. ఎవరూ నిన్ను కాపాడలేరు. సిద్ధూ మూసేవాలా మరణం సమయంలో నీ స్పందన చూశాం. అతడు ఎలాంటి మనిషి అని, ఎలాంటి క్రిమినల్ కనెక్షన్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు. నువ్వు ఇప్పుడు మా రాడార్‌లో ఉన్నావు. ఇది ట్రైలర్ అనుకో. పూర్తి సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది. నీకు నచ్చిన దేశానికి ఎగిరి వెళ్లిపో. కానీ గుర్తుపెట్టుకో.. చావుకు వీసా అవసరం లేదు. అది పిలవకుండానే వస్తుంది’’ అంటూ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా హెచ్చరిక వచ్చింది.
ఇండియా నుంచి కాదు..
ఈ ఫేస్‌బుక్ పోస్ట్ చూసిన తర్వాత సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరీక్షించారు ముంబాయ్ పోలీసులు. ఇది మామూలు పోస్ట్ కాదని, దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని అర్థం చేసుకోవాలని సల్మాన్‌ను అలర్ట్ చేశారు. అంతే కాకుండా అసలు ఈ పోస్ట్ ఎవరు చేశారు, ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయాలపై నిఘా పెట్టారు. ముందస్తు విచారణ బట్టి చూస్తే ఈ ఫేస్‌బుక్ పోస్ట్ ఇండియా నుంచి కాకుండా, బయట నుంచి చేయడం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మార్చ్‌లో ముందుగా లారెన్స్ బిష్నాయ్ నుంచి హత్యా బెదిరింపులు ఎదుర్కున్నాడు సల్మాన్. ఆ తర్వాత పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను హత్య చేయడంతో బిష్నాయ్ ఎలాంటి వ్యక్తి అని అందరికీ అర్థమయ్యింది. దీంతో సల్మాన్‌కు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని తన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఆ రొమాంటిక్ సీన్స్ అన్నీ కట్? ‘యానిమల్’కు షాకిచ్చిన సెన్సార్ బోర్డ్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply