(Source: Poll of Polls)
Salaar Advance Bookings: ‘డంకీ’ అడ్డుకున్నా డైనోసర్‌దే పైచేయి, బుకింగ్స్‌లో అదుర్స్ అనిపిస్తోన్న ‘సలార్’ - అప్పుడే అన్ని టికెట్లా!
Salaar : సలార్ రిలీజ్ కు ఇంకా 12 గంటలు మిగిలి ఉండగానే దేశవ్యాప్తంగా 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన 'సలార్' రిలీజ్ ముందే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘కే.జి.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే రికార్డుల వేట మొదలుపెట్టిన సలార్ రాబోయే పాన్ ఇండియా సినిమాలకు సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. సినిమా రిలీజ్ కి ఇంకా 12 గంటల సమయం మిగిలి ఉండగానే ‘సలార్’ సినిమాకి సంబంధించి ఏకంగా 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని ‘సలార్’ మూవీ టీం తాజాగా వెల్లడించింది.
బుధవారం రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఈ సినిమాకి ఎన్ని టికెట్లు తెగాయి అనే విషయం మీద సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించి నేషనల్ చైన్ మల్టీప్లెక్స్ అయినా పివిఆర్- ఐనాక్స్, సినీ పోలీస్ మినహాయించి ఇప్పటివరకు 30 లక్షల యాభైవేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల 25000, నైజాం 6 లక్షలు, నార్త్ ఇండియా 5,25,000, కర్ణాటక 3. 25 వేలు, కేరళలో లక్షన్నర, తమిళనాడులో లక్ష మొత్తం 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. త్వరలోనే అడిషనల్ స్క్రీన్స్ కూడా బుకింగ్స్ ఓపెన్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
కాగా ఇది కాకుండా బీసీ సెంటర్స్ లో ఆన్లైన్ ఎక్కువగా ఉండదు కాబట్టి వాటి లెక్కలు కూడా ఇంకా తేలాల్సి ఉంది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ‘సలార్’ షోలు మొదలవుతున్న తరుణంలో సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే సలార్ మూవీకి 100 నుంచి 150 కోట్ల మధ్య ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వచ్చే సంక్రాంతి దాకా ఈ సినిమాకి ఎలాంటి పోటీ ఉండదు. కాబట్టి అప్పటివరకు బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యికోట్ల మార్క్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్క్రీన్స్ షేరింగ్ విషయంలో ‘డంకీ’ నిర్మాతలు ఎన్ని రాజకీయాలకు పాల్పడినా.. డైనోసర్ బెదరలేదని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇందుకు ఈ బుకింగ్సే నిదర్శనమని అంటున్నారు.
మరోవైపు ఓవర్సీస్ లో ‘సలార్’ క్రేజ్ తారా స్థాయికి చేరింది. అమెరికాలో 'సలార్' కోసం 2500 ప్రీమియర్ షోలను తెలుగు వారి కోసం ఏర్పాటు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటి వరకు అక్కడ 2500 షోలను ఏర్పాటు చేసిన సందర్భం లేదు. అది కేవలం సలార్ మాత్రమే దక్కడం విశేషం. ‘కేజిఎఫ్’ సినిమాని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ప్రభాస్‌కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, ఈశ్వరి రావు, బాబి సింహ, టీనూ ఆనంద్, సప్తగిరి, పృధ్విరాజ్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 22న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Also Read : 'సలార్' సెకండ్ సింగిల్ వచ్చేసింది - యుద్ధమైన చిరునవ్వుతోనే ఆపేసి చూపాలిరా!