![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Salaar: సలార్ టికెట్స్ ఫ్రీగా ఇస్తా, యంగ్ హీరోకి సోషల్ మీడియాలో రిక్వెస్టుల మీద రిక్వెస్టులు
Nikhil on Salaar: యంగ్ హీరో నిఖిల్ ప్రభాస్ అభిమానుల కోసం సలార్ 100 టికెట్స్ ని ఉచితంగా ఇస్తానని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
![Salaar: సలార్ టికెట్స్ ఫ్రీగా ఇస్తా, యంగ్ హీరోకి సోషల్ మీడియాలో రిక్వెస్టుల మీద రిక్వెస్టులు Salaar advance bookings Nikhil to give away 100 tickets of 1am show Sreeramulu Theatre Salaar: సలార్ టికెట్స్ ఫ్రీగా ఇస్తా, యంగ్ హీరోకి సోషల్ మీడియాలో రిక్వెస్టుల మీద రిక్వెస్టులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/3f8a1b74895eb940d119abe63bc37b851702793863406753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Actor Nikhil To Give Away 100 Salaar Tickets : ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'సలార్' మూవీ మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి.
రిలీజ్ దగ్గర పడుతున్నా సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు మూవీ టీం. అయినా కూడా సినిమాపై అంచనాలు మాత్రం రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా క్యాన్సిల్ చేసి సింపుల్ గా రాజమౌళితో ఇంటర్వ్యూ చేశారు. అలాగే రీసెంట్ గా సలార్ మూవీ ఫస్ట్ టికెట్ ని రాజమౌళి అందుకున్న విషయం తెలిసిందే. ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ నెలలో జరుగుతున్నాయి. శుక్రవారం కర్ణాటకలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని మేకర్స్ ప్రకటించారు.
Giving away 100 Tickets for the 1 am show #SALAAR along with me at #SriRamulu Theatre... especially to DieHard fans of #Darling #Prabhas bhai.. #OnPublicDemand
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 16, 2023
10 years back I watched the 1 am Special show of #Mirchi movie at the same theatre.. let History Repeat 🔥 https://t.co/jstXB6Lm0r
రిలీజ్ కి ఐదు రోజులే ఉండగా ఇప్పటివరకు బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వకపోవడం గమనార్హం. సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ డే టికెట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అందించాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్లో డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంటకు సలార్ షో పడుతుందని, ఈ షోకి 100 మంది ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ కి ఉచితంగా టికెట్స్ ఇస్తానని, వాళ్ళతో కలిసి సినిమా చూస్తానని నిఖిల్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
"పదేళ్ల క్రితం ఇదే థియేటర్లో మిర్చి సినిమా రాత్రి ఒంటి గంట షో చూశాను. ఇప్పుడు సలార్ సినిమాతో హిస్టరీ మళ్లీ రిపీట్ అవుతుంది" అంటూ తన ట్విట్టర్లో తెలిపాడు నిఖిల్. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే సలార్ 100 టికెట్లను ప్రభాస్ డైలాగ్స్ కి ఫ్రీగా ఇస్తానన్న నిఖిల్ ఆ టికెట్స్ ఎలా తీసుకోవాలనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా నిఖిల్ లాంటి యంగ్ హీరో ప్రభాస్ పై ఈ విధంగా తన అభిమానాన్ని చాటుకోవడం విశేషమనే చెప్పాలి. కాగా సలార్ మూవీని కేజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు.
Also Read : తండ్రి కాబోతున్న మంచు మనోజ్ - అత్తగారి జయంతికి శుభవార్త
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)