Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్ - అత్తగారి జయంతికి శుభవార్త
Manchu Manoj and Bhuma Mounika announce their first pregnancy: మంచు మనోజ్ శనివారం గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

Manchu Manoj and Bhuma Mounika Reddy are expecting baby very soon: హీరో మంచు మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్నారు. తన అత్తగారు, దివంగత రాజకీయ నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ప్రేక్షకులతో శుభవార్త పంచుకున్నారు. తన సతీమణి భూమా నాగ మౌనికా రెడ్డి తల్లి కాబోతున్నట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పారు.
మార్చిలో ఏడు అడుగులు వేసిన మనోజ్, మౌనిక!
మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి ఈ ఏడాది మార్చి 3న వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. వివాహానికి ముందు నుంచి వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.
Also Read: 'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్
మంచు మనోజ్, మౌనికా రెడ్డి... ఇద్దరికీ ఇది రెండో వివాహమే. దివంగత రాజకీయ నాయకులు భూమా నాగి రెడ్డి, భూమా శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె నాగ మౌనిక. మనోజ్ తండ్రి మోహన్ బాబు, సోదరుడు విష్ణు, సోదరి లక్ష్మీ... మౌనిక అక్క అఖిలప్రియ, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి... ఇరువురి కుటుంబ సభ్యుల నడుమ, వాళ్ళ అశీసులతో పెళ్లి జరిగింది. మౌనికా రెడ్డికి ఇది రెండో సంతానం. ఆల్రెడీ ఆమెకు ఓ బాబు ఉన్నారు. ఆ అబ్బాయి అన్నయ్య కాబోతున్నట్లు మనోజ్ ట్వీట్ చేశారు. ఆ బిడ్డను ప్రేమగా చూసుకుంటున్నారు ఆయన.
Also Read: కళ్యాణ్ రామ్ 'డెవిల్' చూసిన 'దిల్' రాజు - 'బింబిసార' సెంటిమెంట్ రిపీట్!
"Remembering and honoring my beloved Athamma, Shree Bhuma Shoba Nagi Reddy garu, on her birthday 🙏🏼❤️
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 16, 2023
Athamma. In your loving embrace, we find comfort in sharing joyful news: Shree Bhuma Nagi Reddy Mama and you are becoming grandparents once again. Our little Dhairav is… pic.twitter.com/7ZIXk5rPtn
పెళ్లి గురించి 2022లో హింట్ ఇచ్చిన మనోజ్!
మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గత ఏడాది (2022) సెప్టెంబర్ మాసం తొలి వారంలో భాగ్య నగరంలోని సీతాఫల్ మండిలోని వినాయక మండపంలో జంటగా కనిపించారు. గణనాథునికి పూజలు చేశారు. ఆ సమయంలో వాళ్ళ ప్రేమ విషయం బయటకు వచ్చింది. అప్పుడు మీడియా ప్రతినిధులు పెళ్లి గురించి ప్రశ్నించగా... తన వ్యక్తిగత విషయమని మనోజ్ చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో కడప దర్గాను మనోజ్ సందర్శించారు. అప్పుడు త్వరలో తాను కొత్త జీవితం ప్రారంభిస్తునున్నట్టు, కుటుంబంతో కడప దర్గాకు మళ్ళీ రావాలని ఉందని పేర్కొన్నారు. అప్పుడు మనోజ్, భూమిక పెళ్లి చేసుకుంటారనే స్పష్టత వచ్చింది.
మనోజ్ తొలి వివాహం విషయానికి వస్తే... ప్రణతి రెడ్డిని 2015లో ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. తమ దారులు వేర్వేరు అంటూ 2019లో విడిపోయారు. విడాకుల తర్వాత చాలా రోజులు మనోజ్ ఒంటరిగా ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

