అన్వేషించండి

Sai Pallavi: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో అక్క హడావిడి - వైరల్ అవుతున్న సాయి పల్లవి డ్యాన్స్ వీడియో

Sai Pallavi Dance: ప్రస్తుతం సాయి పల్లవి ఇంట పెళ్లి హడావిడి మొదలయ్యింది. తన చెల్లెలు పూజా కన్నన్ ఎంగేజ్‌మెంట్‌లో సాయి పల్లవి డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sai Pallavi Dance at Pooja Kannan Engagement: టాలీవుడ్‌లో యాక్టింగ్, డ్యాన్స్, అందం.. ఇలా అన్నింటిలో తనకు తానే సాటి అని గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ఇక ఈ హీరోయిన్ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్.. తను ప్రేమించిన వినీత్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యింది. తాజాగా పూజా, వినీత్‌లకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్‌లో సాయి పల్లవి తన డ్యాన్స్‌తో అక్కడికి వచ్చిన వారిని ఫిదా చేసింది. ప్రస్తుతం పూజా ఎంగేజ్‌మెంట్‌లో సాయి పల్లవి డ్యాన్స్ చేసి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆన్ స్క్రీన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ అయినా సాయి పల్లవి పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేయడం కన్నుల పండుగలాగా ఉంటుందని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

పెళ్లి వేడుకల్లో సాయి పల్లవి హడావిడి..

సాయి పల్లవి డ్యాన్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్.. తను డ్యాన్స్ చేస్తే నెమలి నాట్యం చేసినట్టు ఉంటుందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అలాంటి తన చెల్లి పెళ్లి వేడుక అంటే సాయి పల్లవి డ్యాన్స్ చేయకుండా ఉంటుందా? కచ్చితంగా చేస్తుంది. అలా తన సంతోషంగా డ్యాన్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్.. వినీత్ అనే వ్యక్తితో చాలాకాలంగా ప్రేమలో ఉంది. ఫైనల్‌గా వీరిద్దరూ తమ పెళ్లి కోసం పెద్దలను ఒప్పించారు. ఇక తాజాగా తన ప్రేమ, పెళ్లి విషయాలను అధికారికంగా తన సోషల్ మీడియాలో ప్రకటించింది పూజా. 

సోషల్ మీడియాలో యాక్టివ్..

సాయి పల్లవి ఇంట పూజా, వినీత్‌ల పెళ్లి సందడి మొదలయ్యింది. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను పూజా.. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది. మెహందీ పెట్టుకొని.. తన అక్కతో కలిసి స్మైల్ ఇస్తూ దిగిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అలా తను షేర్ చేసిన చాలావరకు ఫోటోల్లో సాయి పల్లవి కూడా ఉంది. చెల్లి పెళ్లి అయినా కూడా సాయి పల్లవి మాత్రం సింపుల్‌గా రెడీ అవ్వడానికే ఇష్టపడింది అంటూ తనలోని ఆ సింపుల్ క్యారెక్టర్‌ను ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. అలా పూజా ఎంగేజ్‌మెంట్ నుండి సాయి పల్లవి ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. 

ఒక్కటే సినిమా..

సాయి పల్లవిలాగానే తన చెల్లెలు పూజా కన్నన్ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేసింది. ముందుగా ఒక ప్రముఖ డైరెక్టర్ దగ్గర కొన్నాళ్లపాటు అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆ తర్వాత ‘చిత్తిరయ్ సెవ్వనం’ అనే చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తన అక్కలాగా కమర్షియల్ సినిమాతో కాకుండా ఒక సోషల్ మెసేజ్, ఎమోషనల్ డ్రామాతో నటిగా డెబ్యూ ఇచ్చింది పూజా. మొదటి సినిమాలోనే తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. కానీ ఏమైందో తెలియదు.. ఒక్క సినిమాతోనే తన యాక్టింగ్ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిత్తిరయ్ సెవ్వనం’ మాత్రమే పూజా కన్నన్ నటించిన ఏకైక సినిమా. ఇక ఇంతలోనే తను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, తనను పెళ్లి కూడా చేసుకుంటున్నానని ప్రకటించి షాక్ ఇచ్చింది పూజా.

Also Read: నయా నరేంద్ర మోడీ బయోపిక్‌ - అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget