Sai Dharam Tej: ‘శ్రీదేవి శోభన్ బాబు’కు సాయిధరమ్ తేజ్ ‘రొమాంటిక్’ సర్‌ప్రైజ్!
సంతోష్ శోభన్, గౌరీ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. ఈ చిత్రం నుంచి సాయి ధరమ్ తేజ్ ఓ ‘రొమాంటిక్’ సాంగ్‌ను రిలీజ్ చేసి అభిమానులను అలరించాడు.
Sridevi Shoban Babu Song | శ్రీదేవి, శోభన్ బాబు అనగానే మనకు అలనాటి చిత్రాలే గుర్తుకొస్తాయి. అతిలోక సుందరి శ్రీదేవి, రొమాంటిక్ హీరో శోభన్ బాబు జంటగా అప్పట్లో విడుదలైన సినిమాలు మాంచి హిట్ కొట్టాయి. ఇప్పుడు ఆ జంట పేరు మీద ‘శ్రీదేవి శోభన్ బాబు’(Sridevi Shoban Babu) అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సంతోష్ శోభన్(Santosh Shoban), ‘96’ ఫేమ్(సమంత ఫ్లాష్‌బ్యాక్ క్యారెక్టర్) గౌరి జి.కిషన్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల ‘గోల్డ్ బ్యాక్స్ ఎంటర్‌టైన్మెంట్’ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైన ‘శ్రీదేవి శోభన్ బాబు’ టీజర్‌కు మాంచి రెస్పాన్స్ వస్తోంది. గురువారం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej).. ఇందులోని రొమాంటిక్ సాంగ్‌ను ట్విట్టర్‌లో రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘‘నిన్ను చూశాకా..’’ అంటూ సాగే ఈ పాట తప్పకుండా యూత్‌ను ఆకట్టుకుంటుంది. కమ్రాన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటను గాయకుడు జునైద్ కుమార్ ఆలాపించాడు. రాకెందు మౌళి లిరిక్స్ అందించారు.
Also Read: ఇంతకీ ఇల్లు ఎవరిది? శ్రీదేవిదా - శోభన్ బాబుదా!?
Happy to launch #NinnuChusaka from #SrideviShobanBabu for my sweetest akka @sushkonidela 🤗🤗🤗
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 15, 2022
▶️https://t.co/vEkcdzhox4
Congrats on proving your mettle for fresh content with #Senapathi and wish @GoldBoxEnt continues to mint great content.
All d best @santoshshobhan @Gourayy pic.twitter.com/4jbMFcYh1H
సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసిన ‘‘నిన్ను చూశాకా’’ సాంగ్‌ను ఇక్కడ చూడండి.
View this post on Instagram
Also Read:'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?