By: Satya Pulagam | Updated at : 12 Sep 2023 10:25 AM (IST)
'రూల్స్ రంజన్' సినిమాలో నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'రూల్స్ రంజన్' (Rules Ranjan Movie). ఇందులో నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ 'డీజే టిల్లు', 'బెదురులంక 2012' తర్వాత ఆమె నటించిన చిత్రమిది. అందువల్ల, సినిమాపై క్రేజ్ ఏర్పడింది. దాంతో పాటు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టిల జోడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'రూల్స్ రంజన్' సినిమాను నిర్మించింది. ఆయన తనయుడు రత్నం కృష్ణ (జ్యోతి కృష్ణగా ప్రేక్షకులకు పరిచయం) దర్శకత్వం వహించారు. కొంత విరామం తర్వాత ఆయన మెగాఫోన్ పట్టిన చిత్రమిది. దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మాతలు. తొలుత ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ఇప్పుడు విడుదల వాయిదా పడింది.
సెప్టెంబర్ 28న కాదు... అక్టోబర్ 6న!
Rules Ranjan New Release Date : లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సెప్టెంబర్ 28న కాకుండా అక్టోబర్ 6న 'రూల్స్ రంజన్' సినిమాను విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు.
Also Read : ఎన్టీఆర్ బావమరిది సినిమా వాయిదా - ఆ రోజు 'మ్యాడ్' రావడం లేదు!
View this post on InstagramA post shared by STAR LIGHT ENTERTAINMENT PVT LTD (@starlight_entertainments_)
వినోదభరితంగా ట్రైలర్... క్రేజ్ పెంచిన సాంగ్!
కిరణ్ అబ్బవరం ఎప్పుడూ తన సినిమాల్లో మంచి పాటలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాల్లో పాటలు శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. 'రూల్స్ రంజన్' పాటలకు సైతం మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా 'సమ్మోహనుడా' పాట సినిమాపై క్రేజ్ పెంచింది. మిగతా పాటలకు కూడా రెస్పాన్స్ బావుంది.
ఇటీవల 'రూల్స్ రంజన్' ట్రైలర్ విడుదల చేశారు. అందులో కథ కంటే కామెడీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. పంచ్ డైలాగ్స్ పేలాయి. దాంతో మరో ఫన్ ఫిల్మ్ థియేటర్లలోకి వస్తుందని ప్రేక్షకుల్లో బజ్ ఏర్పడింది. ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపించనున్నారు. తన కాలేజీలో అమ్మాయి మళ్ళీ పరిచయం అయితే... ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? రూల్స్ రంజన్ కాస్తా పబ్ రంజన్, మనో రంజన్ కింద ఎందుకు మారాడు? అనేది కథగా తెలుస్తోంది.
Also Read : రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో మెహర్ చాహల్ రెండో కథానాయిక. ఇంతకు ముందు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన '7 డేస్ 6 నైట్స్'లో ఆమె ఓ కథానాయికగా నటించారు. ఇంకా 'రూల్స్ రంజన్' సినిమాలో 'వెన్నెల' కిశోర్, 'హైపర్' ఆది, సుబ్బరాజు, 'వైవా' హర్ష (హర్ష చెముడు), అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, 'నెల్లూరు' సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఎం. సుధీర్, కూర్పు : వరప్రసాద్, ఛాయాగ్రహణం : దులీప్ కుమార్, సహ నిర్మాత : రింకు కుక్రెజ, సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!
అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!
‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
/body>