అన్వేషించండి

Rukmini Vasanth: బెంగళూరు సైబర్ సెల్‌లో రుక్మిణీ వసంత్ కంప్లైంట్... డీప్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్

Rukmini Vasanth Deepfake Case Row: డీప్ ఫేక్ బికినీ వీడియో, ఫోటోలు తనవి కావని స్పష్టం చేసిన రుక్మిణీ వసంత్... మరో అడుగు వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) పేరు ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం... డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోల బారిన పడిన లేటెస్ట్ హీరోయిన్ ఆమె. రుక్మిణీ వసంత్ పేరుతో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ డీప్‌ఫేక్ - ఏఐ జనరేటెడ్ వీడియో, ఫోటోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు రుక్మిణీ వసంత్ ఫిర్యాదు చేశారు. ఇంకా ఆవిడ ఏమన్నారంటే?

హీరోయిన్లకు మాత్రమే కాదు... సాధారణ మహిళలకూ
డీప్ ఫేక్ వీడియో, ఫోటోలపై సైబర్ క్రైమ్ విభాగం సమగ్ర విచారణ జరుపుతుందని, ఆ డిపార్ట్మెంట్ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని రుక్మిణీ వసంత్ తెలిపారు. ఈ కేసు, సమాజంలో మహిళల గురించి ఆమె మాట్లాడుతూ... ''ఇటువంటి సమస్యలు కేవలం హీరోయిన్లకు మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా ఎంతో మంది సాధారణ మహిళలు, అమ్మాయిలకు ఎదురు అవుతున్నాయి. ఏఐ (AI)లో ఎన్నో పాజిటివ్ విషయాలు ఉన్నాయి. వాటిని వదిలేసి ఇతరులను ఇబ్బంది పెట్టడానికి, ఎదుటి వ్యక్తిని క్షోభకు గురి చేయడానికి దుర్వినియోగం చేయడం సరికాదు. ప్రేక్షకులు, ప్రజలు ఇటువంటి ఫేక్ కంటెంట్‌ను షేర్ చేయడం గానీ, ఎంకరేజ్ చేయడం గానీ చేయవద్దు'' అని తెలిపారు. 

Also ReadAnsiba Hassan - Jihadi Remark Controversy: జిహాదీ అన్నాడు... వేధించారు... బాంబు పేల్చిన 'దృశ్యం 3' నటి

బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన రుక్మిణీ వసంత్‌ను డీప్ ఫేక్ వీడియో గురించి స్పందించమని మీడియా ప్రతినిధులు అడగ్గా... తాను చెప్పాలని అనుకున్నది సోషల్ మీడియాలో చెప్పానని తెలిపారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు ఆల్రెడీ ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన డీప్ ఫేక్ బికినీ వీడియో తన ప్రైవసీని దెబ్బ తీయడమే కాకుండా... తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూస్తే... నిజంగా రుక్మిణీ వసంత్ టూ పీస్ బికినీ ధరించినట్టు అనిపిస్తుంది. గ్రీన్ కలర్ బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫోటో షూట్ చేస్తున్నట్లు ఉంది. అది చూసి చాలా మంది నెటిజన్లు రుక్మిణీ వసంత్ ఒరిజినల్ వీడియో అనుకుని పొరబడ్డారు. అయితే... అది ఫేక్ వీడియో అని, వాటితో తనకు సంబంధం లేదని రుక్మిణీ వసంత్ క్లారిటీ చేశారు.

Also Read: AR Rahman Reviews Ram Charan Peddi - రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు రెహమాన్ రివ్యూ... ఆస్కార్ విన్నర్ ఏమన్నారంటే?

Rukmini Vasanth Upcoming Movies: రుక్మిణీ వసంత్ కెరీర్ విషయానికి వస్తే... రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1'తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. అందులో యువరాణిలా నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ చేశారు. అంతకు ముందు రక్షిత్ శెట్టి 'సప్త సాగరాలు దాటి' కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం కన్నడ స్టార్ యశ్ 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్'లోనూ కథానాయికగా నటిస్తున్నారు.

Also ReadDrishyam 3 Three Days Collections - మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్... 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hrudayam Murali OTT : ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ - ఓటీటీలోకి తమన్ రీసెంట్ మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ - ఓటీటీలోకి తమన్ రీసెంట్ మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget