అన్వేషించండి

AR Rahman On Peddi: రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు రెహమాన్ రివ్యూ... ఆస్కార్ విన్నర్ ఏమన్నారంటే?

AR Rahman Reviews Peddi: 'పెద్ది'లో రామ్ చరణ్ విశ్వరూపం చూపించారని ఆస్కార్ విన్నర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?

రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు  ఉన్నాయి. ఆస్కార్ విన్నర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) వాటిని మరింత పెంచారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన 'పెద్ది కీ ఆవాజ్' (Peddi Ki Aawaz)లో రామ్ చరణ్ నటనపై రెహమాన్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాకు రివ్యూ (Peddi Review) ఇవ్వమని అడగ్గా... ఆయన ఏం చెప్పారంటే?  

ప్రతి ఫ్రేమ్‌లోనూ చరణ్ కష్టం కనిపిస్తుంది
'పెద్ది' సినిమా కోసం, ఆ పాత్రలో నటన కోసం రామ్ చరణ్ పడిన కష్టం, చూపించిన అంకితభావం అమోఘమని ఏఆర్ రెహమాన్ చెప్పారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో ఆయన నటన అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు.

రామ్ చరణ్ డ్యాన్స్ గురించి రెహమాన్ మాట్లాడారు. ''నా పాటలకు రామ్ చరణ్ డ్యాన్స్, ఆ ఎనర్జీ కొత్త అర్థాన్ని ఇచ్చాయి. ఓ హీరో పాటలోని ప్రతి మూమెంట్‌ను మనస్ఫూర్తిగా ఓన్ చేసుకున్నప్పుడే ఆ సంగీతానికి పూర్తి ప్రాణం వస్తుంది. రామ్ చరణ్ విషయంలో అది అక్షరాలా నిజమైంది. తన డ్యాన్స్ వల్ల సాంగ్స్ మరింత హిట్ అయ్యాయి" అని రెహమాన్ చెప్పారు. 'పెద్ది'గా రామ్ చరణ్ నటన తెలుగుతో పాటు మిగతా భాషల ప్రేక్షకులనూ కట్టి పడేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భోపాల్ ఈవెంట్ స్పెషాలిటీ ఏమిటంటే... 'పెద్ది' సినిమాలోని 'రై రై రారా' పాటకు రెహమాన్ స్వయంగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

Also Read: Drishyam 3 Three Days Collections - మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్... 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'

దర్శకుడు బుచ్చిబాబు సానా మేకింగ్ స్టైల్, హీరోయిన్ జాన్వీ కపూర్ నటనను కూడా ఏఆర్ రెహమాన్ మెచ్చుకున్నారు. అంతే కాదు... మెగా ఫ్యాన్స్, 'పెద్ది' సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు రెహమాన్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. సినిమాలో మరికొన్ని పాటలు ఉన్నాయని చెప్పారు. కథలో భాగంగా కొన్ని పాటలు వచ్చాయని, నేపథ్యంలో అవి వినిపిస్తాయని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన తెలిపారు.

Also Read: Ansiba Hassan - Jihadi Remark Controversy: జిహాదీ అన్నాడు... వేధించారు... బాంబు పేల్చిన 'దృశ్యం 3' నటి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PEDDI (@peddimovie)

వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన 'పెద్ది' జూన్ 4న థియేటర్లలోకి వస్తోంది. జూన్ 3న అమెరికాలో ప్రీమియర్లు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేశారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, రవి కిషన్, దివ్యేందు శర్మ తదితరులు సినిమాలో నటించారు. 

Also Read: Ram Charan On Jasprit Bumrah - రామ్ చరణ్ మళ్ళీ దొరికేశాడు... క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు

టాప్ హెడ్ లైన్స్

Mayasabha Series : పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ' న్యూ రికార్డ్ - ఇండియాలోనే ఫస్ట్ తెలుగు సిరీస్...
పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ' న్యూ రికార్డ్ - ఇండియాలోనే ఫస్ట్ తెలుగు సిరీస్...
Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
Tharun Bhascker Eesha Rebba : తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా రిలేషన్? - పార్ట్‌నర్ సోల్‌మేట్ అంటూ కన్ఫర్మ్
తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా రిలేషన్? - పార్ట్‌నర్ సోల్‌మేట్ అంటూ కన్ఫర్మ్
Chiranjeevi Kaaka : అనస్వర నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? - 'కాకా' నుంచి మరో చిరు లీక్
అనస్వర నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? - 'కాకా' నుంచి మరో చిరు లీక్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Embed widget