అన్వేషించండి

Ansiba Hassan: జిహాదీ అన్నాడు... వేధించారు... బాంబు పేల్చిన 'దృశ్యం 3' నటి

Ansiba Hassan - Jihadi Controversy: 'దృశ్యం 3'లో మోహన్ లాల్ పెద్ద కుమార్తె అంజు పాత్రలో నటించిన అన్సిబా హసన్ తోటి నటుడు టినీ టామ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

Ansiba Hassan vs Tiny Tom - Jihadi Remark Controversy: 'దృశ్యం 3' చూశారా? మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పెద్ద కుమార్తె అంజు పాత్రలో నటించిన అమ్మాయే... పైన ఫోటోలో ఉన్నది. ఆమె పేరు అన్సిబా హసన్ (Ansiba Hassan). సినిమా విజయం కంటే సంచలన వార్తతో ఆమె పేరు మలయాళ చిత్ర పరిశ్రమలో వైరల్ అవుతోంది. జిహాదీ అంటూ తనను తోటి నటుడు కామెంట్ చేశారని ఆమె ఆరోపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

జిహాదీ అన్నాడు... మతపరమైన కామెంట్స్ చేశారు!
అన్సిబా హసన్ ముస్లిం అమ్మాయి. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'దృశ్యం 3'తో వచ్చిందీ నటి. ఇక ఆమె మతం గురించి తెలుగు ప్రజలకు తెలిసే అవకాశం తక్కువ. అన్సిబా మతం ప్రస్తావన ఎందుకంటే...

నటుడు టినీ టామ్ (Tiny Tom) మీద ఆవిడ మండిపడ్డారు. తనను 'జిహాదీ' అని టినీ టామ్ కామెంట్ చేశాడని ఆరోపించారు. ఇస్లామిక్ తీవ్రవాదులు లేదా మిలిటెంట్లను జిహాదీలు అంటున్న సంగతి తెలిసిందే. దాంతో ఒక్కసారిగా మలయాళ చిత్రసీమలో వాతావరణం వేడెక్కింది. టినీ టామ్ వర్సెస్ అన్సిబా హాసన్... ఇద్దరి మధ్య మతపరమైన, వ్యక్తిగత ఆరోపణలు - వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

అన్సిబా వర్సెస్ టినీ టామ్ గొడవ ఏంటి?
అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)లో జాయింట్ సెక్రటరీగా పని చేశారు అన్సిబా హాసన్. ఫిబ్రవరి, 2026న ఆ పదవికి రాజీనామా చేశారు. పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అప్పట్లో తెలిపారు. అయితే... ఇప్పుడు 'అమ్మ' జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడానికి ఆ సంస్థలో ఎదుర్కొన్న నిరంతర వేధింపులేనని వెల్లడించారు.

Also Read: Ram Charan On Jasprit Bumrah - రామ్ చరణ్ మళ్ళీ దొరికేశాడు... క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు

కో యాక్టర్ డ్రైవర్‌ను బలవంతపు మత మార్పిడి చేశానని 'అమ్మ'లో తనపై తప్పుడు ప్రచారాలు జరిగాయని అన్సిబా హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, 'అమ్మ' ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఒకరు ఉద్దేశపూర్వకంగా తన మీద పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని, అందువల్ల తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యానని అన్సిబా హాసన్ పేర్కొన్నారు. ఆ ఘటనల్లో తనకు 'అమ్మ' నుంచి ఎటువంటి లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తోటి సభ్యుల్లో తనపై చెడు అభిప్రాయం కలిగించేలా ప్రవర్తించారని పేర్కొన్నారామె.

Also ReadDrishyam 3 Three Days Collections - మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్... 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'

అన్సిబా హాసన్ చేసిన ఆరోపణలపై టినీ టామ్ స్పందించారు. గతంలో ఆవిడ ఎప్పుడూ ఈ విషయాలు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా చేసిన సమయంలోనూ వృత్తిపరమైన కారణాలు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మలయాళ చిత్రసీమలో నటుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, రియాలిటీ షో జడ్జిగా టినీ టామ్ గుర్తింపు పొందారు. అయితే... ఇప్పుడు అన్సిబా హాసన్ చేసిన ఆరోపణలు మలయాళ సినిమా ఇండస్ట్రీలో కుల, మతపరమైన వివక్ష ఉందని పెద్ద చర్చకు దారితీశాయి. అక్కడ గొడవలు బయట పడుతున్నాయి.

Also ReadPeddi Release Controversy - పెద్ది పంచాయతీలో పెద్ద ట్విస్ట్... మళ్ళీ మొదటికొచ్చిన టికెట్ రేట్స్, ఎగ్జిబిటర్స్‌ ఇష్యూ

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gatta Kusthi 2 OTT : మూడు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి తమిళ మూవీ - టాప్ 5 రీజన్స్... ఎందుకు, ఎందులో చూడాలంటే?
మూడు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి తమిళ మూవీ - టాప్ 5 రీజన్స్... ఎందుకు, ఎందులో చూడాలంటే?
Main Vaapas Aaunga OTT : ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన ప్రేమ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన ప్రేమ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget