అన్వేషించండి

Ram Charan: పేర్లతో రామ్ చరణ్ కన్‌ఫ్యూజన్... ఫుల్ ట్రోల్స్‌, చివరకు బుమ్రాకు సారీ చెప్పిన మెగా పవర్ స్టార్

Ram Charan On Jasprit Bumrah: రామ్ చరణ్‌కు పేర్లు గుర్తుండవని 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పారు. 'పెద్ది' భోపాల్ ఈవెంట్‌లో అది ప్రేక్షకులకూ అర్థమైంది. క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు.

Ram Charan Praises Jasprit Bumrah Football Skills: రామ్ చరణ్ మనుషులను గుర్తు పెట్టుకోవడం కష్టమని, పేర్లు మారుస్తాడని 'ఆర్ఆర్ఆర్' విడుదల సమయంలో ఎంఎం కీరవాణికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పారు. ఇప్పుడు 'పెద్ది' భోపాల్ ఈవెంట్ సాక్షిగా ఆ విషయం ప్రేక్షకులకూ అర్థమైంది. టీమ్ ఇండియా క్రికెటర్ జస్‌ప్రీత్ సింగ్ బుమ్రాను ఫుల్ బాలర్ చేసేశారు రామ్ చరణ్. ఇంకేముంది? సోషల్ మీడియాలో ఒక్కటే జోకులు. తన తప్పు లేదా పొరపాటును గ్రహించిన రామ్ చరణ్ సారీ చెప్పారు.

బుమ్రా... మీ ఫుట్ బాల్ ఆటకు నేను ఫ్యాన్!
క్రికెట్, కుస్తీ, రన్నింగ్... 'పెద్ది' సినిమాలో హీరో మూడు ఆటలు ఆడతారు. ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. అందులోనూ మన భారతీయులకు సినిమాలు, క్రికెట్ అంటే పిచ్చి. వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ అందించేవి కూడా ఆ రెండే. అందుకని, 'పెద్ది' భోపాల్ ఈవెంట్ (Peddi Bhopal Event)లో ఈ క్రికెటర్ల పేర్లు చెబితే మీకు ఏం గుర్తుకు వస్తుంది? ఒక్క మాట చెప్పమని రామ్ చరణ్‌ను యాంకర్ అడిగారు. 

సచిన్ అంటే లాంగ్ లెజెండరీ రన్, ఎంఎస్ ధోని అంటే కామ్ అండ్ కూల్, రోహిత్ శర్మ పేరు చెప్పగానే అందరి ప్రేమను పొందిన వ్యక్తి అని, విరాట్ కోహ్లీ అంటే ఫైర్ అని చెప్పారు రామ్ చరణ్. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత జస్‌ప్రీత్ సింగ్ బుమ్రా పేరు చెప్పగా... ''నేను మీకు పెద్ద అభిమానిని. నాకు ఫుట్ బాల్ అంటే ఇష్టం. ఈ ఆటను మీరు మరింత ముందుకు తీసుకు వెళ్తున్నారు. లవ్ యు'' అని చెప్పారు. దాంతో జనాలు షాక్ అయ్యారు.

Also Read: Drishyam 3 Three Days Collections - మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్... 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'

బుమ్రాకు సారీ చెప్పిన రామ్ చరణ్!
తప్పు అనండి లేదా పొరపాటు అనండి... రామ్ చరణ్ తాను చేసిన పనిని వెంటనే గ్రహించారు. ఈవెంట్ అయ్యాక సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో బుమ్రాకు సారీ చెబుతూ ట్వీట్ చేశారు. ''నిజంగా కొన్నిసార్లు నేను పేర్లు మర్చిపోతా. మిక్స్ అప్ చేసినందుకు బుమ్రాకు సారీ చెబుతున్నాను. అంత మంది భారీ జన సందోహం, ఎగ్జైట్‌మెంట్ మధ్యలో జరిగిన మానవ తప్పిదం అది. బుమ్రా... మీరు అంటే నిజంగా గౌరవం. మీ ఆటకు నేను అభిమానిని'' అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 

Also ReadPeddi Release Controversy - పెద్ది పంచాయతీలో పెద్ద ట్విస్ట్... మళ్ళీ మొదటికొచ్చిన టికెట్ రేట్స్, ఎగ్జిబిటర్స్‌ ఇష్యూ

'పెద్ది' భోపాల్ ఈవెంట్ మధ్యలో ఒకసారి భోపాల్ బదులు బీహార్ అన్నారు రామ్ చరణ్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈవెంట్ అయితే ఆయన కన్‌ఫ్యూజ్ అయ్యారు. అయితే వెంటనే యాంకర్ కరెక్ట్ చేశారు.

బుమ్రా మీద సోషల్ మీడియాలో సెటైర్లు!
బుమ్రాను రామ్ చరణ్ క్రికెటర్ చేశాక సోషల్ మీడియాలో అతనిపై సెటైర్లు పడ్డాయి. ఈసారి ఐపీఎల్ సీజన్ మొత్తం మీద కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశారని, అందుకే అతడిని క్రికెటర్ నుంచి ఫుల్ బాలర్ చేశారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Also ReadRukmini Vasanth On Deepfake Bikini Video - బికినీ వీడియోపై రుక్మిణీ వసంత్ రియాక్షన్... లీగల్ యాక్షన్‌కు రెడీ

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sanchita Ugale: ఎవరీ సంచిత? 22 ఏళ్ళకు ఆత్మహత్య... 'ఛావా'తో పాటు ఎందులో నటించారంటే?
ఎవరీ సంచిత? 22 ఏళ్ళకు ఆత్మహత్య... 'ఛావా'తో పాటు ఎందులో నటించారంటే?
Pawan Kalyan : నిరంజన్‌కు పవన్ కల్యాణ్ గిఫ్ట్స్ - గంటలోనే అభిమాని కోరిక తీర్చిన పవర్ స్టార్
నిరంజన్‌కు పవన్ కల్యాణ్ గిఫ్ట్స్ - గంటలోనే అభిమాని కోరిక తీర్చిన పవర్ స్టార్
Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
Celebrity Divorce: విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NDA Delimitation Magic Number:ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
Gade Saikrishna Missing Case: సాయికృష్ణ ఏమయ్యాడు? మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్!
సాయికృష్ణ ఏమయ్యాడు? మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్!
Breaking News:ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే!
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
Celebrity Divorce: విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Kids Fall Sick After Schools Reopen : స్కూల్స్ రీ-ఓపెన్ తర్వాత పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? వైద్యులు చెప్పిన కారణాలు ఇవే
స్కూల్స్ రీ-ఓపెన్ తర్వాత పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? వైద్యులు చెప్పిన కారణాలు ఇవే
Embed widget