News
News
X

RRR Wins Best Stunts Award In HCA : 'ఆర్ఆర్ఆర్'కు మరో అవార్డు - మన స్టంట్స్ హాలీవుడ్ క్రిటిక్స్‌కూ నచ్చేశాయ్!

భారతీయ ప్రేక్షకులు అందరికీ గర్వకారణమైన క్షణాలివి. 'ఆర్ఆర్ఆర్' మరోసారి అంతర్జాతీయ అవార్డు వేదికపై మెరిసింది. మనకు మరో అవార్డు తీసుకొచ్చింది.

FOLLOW US: 
Share:

అంతర్జాతీయ అవార్డు వేదికలపై 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే పలు అవార్డులు, బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల రివార్డులు కొల్లగొట్టిన దర్శక ధీరుడు రాజమౌళి సినిమా... అంతర్జాతీయ అవార్డులూ అందుకుంటోంది. లేటెస్టుగా 'హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయస్' అవార్డుల్లో మరో అవార్డు అందుకుంది. 

'ఆర్ఆర్ఆర్' స్టంట్స్ మెచ్చిన 'హెచ్.సిఎ'
'ఆర్ఆర్ఆర్' సినిమాలో స్టంట్స్, యాక్షన్ సీక్వెన్సులు చూసి ప్రేక్షకులు 'ఔరా' అని ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు అడవి ప్రాణులతో ఎన్టీఆర్ దూకే సన్నివేశం గానీ, పతాక సన్నివేశాలకు అల్లూరి సీతారామ రాజు వేషధారణలో రామ్ చరణ్ బాణాలు వేసే సన్నివేశం గానీ అద్భుతం అని చెప్పాలి. ఈ స్టంట్స్ 'హాలీవుడ్ క్రిటిస్ ఛాయస్' జ్యూరీకి కూడా నచ్చింది. అందుకే, అవార్డు ఇచ్చింది.  

అవార్డు అందుకున్న అనంతరం దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ ''మా సినిమాలో స్టంట్స్ గుర్తించి అవార్డు ఇచ్చిన 'హెచ్.సి.ఎ'కు థాంక్స్. నేను ముందుగా మా యాక్షన్ కొరియోగ్రాఫర్లకు థాంక్స్. స్టంట్స్ కంపోజ్ చేయడానికి సాల్మన్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులలో కొన్ని తీయడానికి జూజీ హెల్ప్ చేశారు. ఇతర స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా ఇండియా వచ్చి మా విజన్ అర్థం చేసుకుని, మా వర్కింగ్ స్టైల్ అర్థం చేసుకుని పని చేశారు. మా హీరోలు, వండర్ ఫుల్ యాక్టర్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కు థాంక్స్. రెండు మూడు షాట్స్ లో మాత్రమే బాడీ డబుల్ ఉపయోగించాం. మిగతా యాక్షన్ సీన్లు అన్నిటిలో వాళ్ళు సొంతంగా చేశారు. మా చిత్ర బృందానికి కూడా థాంక్స్. చివరగా... నా భారత దేశం ఎన్నో కథలకు పుట్టినిల్లు. మేరా భారత్ మహాన్'' అని అన్నారు.  

Also Read : ఈ అందాల భామలకు అదృష్టం దక్కేనా? హిట్టు లేక విలవిల!

'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్... ఇద్దరికీ ఆ అవార్డును సంయుక్తంగా ఇచ్చారు. గోల్డెన్ గ్లోబ్ వేదికపై కీరవాణి సగర్వంగా ఆ పురస్కారాన్ని సగర్వంగా అందుకున్నారు. ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ, క్రిటిక్స్ ఛాయస్ మూవీ అవార్డ్స్ నుంచి ఉత్తమ పాటగా 'నాటు నాటు...'కు అవార్డు వచ్చింది. 

Also Read : కార్లలో నిద్రపోయిన రోజులున్నాయి - తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్ పోస్టు!

లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి గాను ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు. ఆయనకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. అయితే, అందరి చూపు ఆస్కార్ నామినేషన్ మీద ఉంది. ఎందుకు అంటే... ప్రపంచ సినిమాలో అన్ని అవార్డులకు పెద్దన్నగా అకాడమీ పురస్కారాలను చూస్తారు కాబట్టి! ఆస్కార్ షార్ట్ లిస్టులో 'నాటు నాటు...' చోటు సంపాదించుకున్న తరుణం నుంచి నామినేషన్ డిస్కషన్ నడించింది. ఇప్పుడు ఆ నామినేషన్ కూడా వచ్చింది. అందుకని అందరూ మార్చి 13 కోసం ఎదురు చూస్తున్నారు. 

అందరి చూపు మార్చి 13 మీదే!
'నాటు నాటు...'కు ఆస్కార్ నామినేషన్ వచ్చింది. మార్చి 13, 2023న విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆ రోజు ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ జరగనుంది. అందుకని, అందరూ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చిన నామినేషన్స్ బట్టి... గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? అనేది అంచనా వేయడం మొదలు అవుతుంది. 

మార్చి 13, 2023న విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆ రోజు ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ జరగనుంది. ఇప్పుడు వచ్చిన నామినేషన్స్ బట్టి... గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? అనేది అంచనా వేయడం మొదలు అవుతుంది. 

Published at : 25 Feb 2023 08:30 AM (IST) Tags: RRR Movie Hollywood Critics Association Best Stunts Award HCA Awards 2023 Winners

సంబంధిత కథనాలు

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?