ఈ అందాల భామలకు అదృష్టం దక్కేనా? హిట్టు లేక విలవిల!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల హవా నడిచేది కొంతకాలమే అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2023లో లక్ కోసం ఎదురు చూస్తున్న అందాల భామలు చాలా మందే ఉన్నారు. మరి వీరిలో ఎవరెవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి.
టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్లకు కొదవ లేదు. ఇప్పటికే స్టార్స్ గా రాణిస్తున్న కథానాయికలతో పాటుగా వారానికో కొత్త బ్యూటీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉంటుంది. ఇతర భాషల్లో సక్సెస్ అయిన ముద్దుగుమ్మలు కూడా దిగుమతి అవుతూ ఉంటారు. ఎందరో వస్తుంటారు.. పోతుంటారు. ఎంతమంది వచ్చినా మేల్ డామినేష్ ఉన్న చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల హవా నడిచేది కొంతకాలమే అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వారిలోనూ అందం అభినయంతో పాటుగా ఆవగింజంత అదృష్టం కలిసొచ్చినవాళ్ళు మాత్రమే ఎక్కువ కాలం రాణిస్తుంటారు. 2023లో లక్ కోసం ఎదురు చూస్తున్న అందాల భామలు చాలా మందే ఉన్నారు.
టాలీవుడ్ లో గడిచిన రెండు నెలల కాలంలో చాలా మంది యంగ్ బ్యూటీస్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 'కళ్యాణం కమనీయం' సినిమాతో కోలీవుడ్ భామ ప్రియా భవానీ శంకర్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అలానే 'బుట్టబొమ్మ' సినిమాతో అనిఖ సురేంద్రన్ హీరోయిన్ గా పరిచయం అవ్వగా, 'అమిగోస్' చిత్రంతో అషికా రంగనాథ్ అడుగుపెట్టింది. ఇదే క్రమంలో 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాతో గౌరీ కిషన్ కూడా కథానాయికగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే కోటి ఆశలతో తెలుగు చిత్ర పరిశ్రమలో కాలు మోపిన ఈ ముద్దుగుమ్మలకు నిరాశే ఎదురైంది. వీరికి ఏమాత్రం లక్ కలిసి రాలేదనే చెప్పాలి.
❤ అప్పుడెప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన మలయాళ కుట్టి మాళవిక నాయర్.. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.
❤ తెలుగులో స్థిరపడిపోవాలని ఎన్నాళ్ళుగానో ట్రై చేస్తున్న నివేతా పేత్ రాజ్.. ఈసారి 'ధమ్కీ' సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుతుందని నమ్మకం పెట్టుకుంది.
❤ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్య వంటి అగ్ర హీరోలతో నటించి కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయిన అను ఎమ్మాన్యుయేల్.. ఇప్పుడు 'రావణాసుర' చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తోంది.
❤ అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' మూవీ ద్వారా సాక్షి వైద్య అనే కొత్త అందం హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మరియు సాంగ్ తో అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది.
❤ 'ఉప్పెన' తో కథానాయికగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. 'ది వారియర్' 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' 'మాచర్ల నియోజక వర్గం' వంటి హ్యాట్రిక్ ప్లాప్స్ చవిచూసింది. అందుకే ఇప్పుడు 'కస్టడీ' చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది.
❤ గతేడాది 'రాధే శ్యామ్' 'ఆచార్య' వంటి డిజాస్టర్స్ అందుకున్న పూజా హెగ్డే.. మహేష్ బాబు SSMB28 తో సాలిడ్ హిట్ అందుతుందని భావిస్తోంది.
❤ '1 నేనొక్కడినే' 'దోచేయ్' సినిమాలు నిరాశ పరచడంతో ముంబై చెక్కేసిన కృతి సనన్.. ఇప్పుడు 'ఆది పురుష్' చిత్రంతో టాలీవుడ్ లో గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.
❤ 'నిశబ్దం' సినిమా తర్వాత సైలెంట్ అయిపోయిన అనుష్క శెట్టి సైతం Anushka48 తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయింది.
ఇలా అనేక మంది సీనియర్ హీరోయిన్లు, కొత్త భామలు 2023 లో లక్ కలిసొస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వీరిలో ఎవరెవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి.