![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ali Fazal: ‘మిర్జాపూర్’ గుడ్డూ భయ్యా తండ్రయ్యాడు - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘హీరామండి’ నటి
Ali Fazal: ‘మిర్జాపూర్’ హీరో అలీ ఫజల్ తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. తమకు పండంటి పాప పుట్టింది అని చెప్పారు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
![Ali Fazal: ‘మిర్జాపూర్’ గుడ్డూ భయ్యా తండ్రయ్యాడు - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘హీరామండి’ నటి Richa Chadha and Ali Fazal are blessed with a baby girl Couple Share News With Fans Ali Fazal: ‘మిర్జాపూర్’ గుడ్డూ భయ్యా తండ్రయ్యాడు - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘హీరామండి’ నటి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/19/2d13c24f6435eed90d9bd18301f105e51721384692284932_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Richa Chadha and Ali Fazal are blessed with a baby girl: బాలీవుడ్ స్టార్ కపుల్ రిచా చద్దా, అలీ ఫజల్ తమ అభిమానులకు తీపికబురు చెప్పారు. తమకి పాప పుట్టిందని ప్రకటించారు. జులై 16న పాప జన్మించిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘మాకు పండంటి ఆడబిడ్డ పుట్టిందని చెప్పేందుకు చాలా ఆనందంగా ఉంది. జులై 16న పసిపాప మా ఇంటికి వచ్చింది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అని పోస్ట్ పెట్టారు. దీంతో అభిమానులు వారికి అభినందనలు తెలుపుతున్నారు.
ఫ్రిబ్రవరిలో వినూత్నంగా..
రిచా చద్దా, అలీ ఫజల్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. 1 + 1 = 3 అంటూ వినూతనంగా ఈ విషయాన్ని వెల్లడించారు. "ఒక చిన్న గుండె చప్పుడు.. మా ప్రపంచంలో చాలా అందమైన శబ్దం" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పాప పుట్టిందని పోస్ట్ చేయడంతో అభిమానులు జూనియర్ రిచా చద్దా వచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2020లో పెళ్లి..
రిచా - అలీ ఫజల్ ది ప్రేమ వివాహం. ఈ జంట నాలుగేళ్లు డేటింగ్ లో ఉంది. అక్టోబర్ 2020లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇప్పుడు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఫక్రీ సెట్స్‌లో కలిసిన రిచా, అలీ ప్రేమలో పడ్డారు. ఇక ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్‌లో వచ్చిన ‘కాల్ మై ఏజెంట్’ షోలో చేశారు ఇద్దరు. 2017 తమ ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టారు. ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’ అనే సినిమా నిర్మించగా.. దానికి అవార్డులు కూడా వచ్చాయి.
మీర్జాపూర్ - 3 స్ట్రీమింగ్..
ఇక అలీ ఫజ్జల్. ‘మిర్జాపూర్’ వెబ్ సీరిస్ ద్వారా తెలుగువారికి పరిచయం. ఆయన నటించిన ‘మిర్జాపూర్’ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఆ సిరీస్ టాప్‌లో ఉంది. అయితే, ఆ సిరీస్ పై కొంతమంది మాత్రం పెదవి విరుస్తున్నారు. అంతగా ఆకట్టుకోలేదని రివ్యూలు చెప్తున్నారు. నిజానికి మీర్జాపూర్ రెండు సీజన్లకు చాలాఫ్యాన్ బేస్ ఉంది. కానీ, ఈ పార్ట్ అభిమానులను నిరాశ పరిచిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఇక రీచా విషయానికొస్తే ఆమె నటించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. దాంట్లో ఆమె తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. ఇక ఆ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. గతంలో గాల్వాన్ ఘటన జరిగిన టైంలో రీచా చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపిన విషయం తెలిసిందే. రిచా చేసిన కామెంట్‌పై ఎంతోమంది మండిపడ్డారు. భారతీయ ఆర్మీని చాలా చులకన చేసి మాట్లాడిందని అప్పట్లో ఆమెపై ఫైర్ అయ్యారు. అప్పట్లో ఆమె ఆర్మీకి సారీ కూడా చెప్పారు.
Also Read: రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం.. మెల్ బోర్న్ ఫిలిమ్ ఫెస్టివల్ లో అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)