అన్వేషించండి

Renu Desai: నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, అకీరాకు అలాంటివి నచ్చవు.. ఆ నిర్ణయం తీసుకుంటే నేనే చెబుతా: రేణూ దేశాయ్

Renu Desai: రేణూ దేశాయ్.. తన పిల్లల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కుమారుడు అకీరా, కూతురు ఆధ్య ఇంట్రెస్ట్స్ ఏంటి అని బయటపెట్టారు. అంతే కాకుండా తన ఆరోగ్య సమస్య గురించి కూడా చెప్పుకొచ్చారు.

Renu Desai About Akira And Aadhya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చినప్పుడు పవన్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. దానివల్ల ఆమె పవన్ ఫ్యాన్స్ నుంచి ఎంతో నెగిటివిటీ కూడా ఎదుర్కున్నారు. ఇక కొన్నిరోజుల క్రితం రేణూ దేశాయ్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మరెన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. అంతే కాకుండా తమ పిల్లలు ఆధ్య, అకీరా భవిష్యత్తు ప్లానింగ్ గురించి కూడా మాట్లాడారు. అకీరా సినీ ఎంట్రీపై కూడా రేణూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను సినిమాలు సైన్ చేయకపోవడానికి ఆరోగ్య సమస్యే కారణమని అన్నారు.

చిన్నప్పటి నుండే..

‘‘నాకు ఆరోగ్యం బాలేదు. కొన్నిరోజుల పాటు నేను రెస్ట్ తీసుకుందామనుకుంటున్నాను. అందుకే సినిమాలు సైన్ చేయడం లేదు. ముందు ఈ ఆరోగ్య సమస్య మా నాన్నమ్మకు ఉండేది, తర్వాత నాన్నకు ఉంది. ఇప్పుడు నాకు వచ్చింది. నాకు మయోకార్డల్ బ్రిడ్జింగ్ అనే సమస్య ఉంది. దాని వల్ల గుండె చాలా స్పీడ్‌గా కొట్టుకుంటుంది. పుట్టుకతో నా గుండె అలాగే ఉంది. కానీ నాకు ఈమధ్యే తెలిసింది. ఎక్కువ నడిస్తే ఆయాసం రావడం, హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ సమస్య గురించి బయటపడింది. ఈ ఆరోగ్య సమస్యకు మందులు వేసుకోవడం వల్లే నేను చాలా లావు అయ్యాను. నాకు ట్రాకీ కార్డియా, అరెథ్మియా, ఎటోపిక్ హార్ట్ బీట్స్, బ్రిడ్జింగ్.. ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ తన ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టారు రేణూ దేశాయ్.

నేనే ప్రకటిస్తాను..

తన పిల్లలు ఆధ్య, అకీరా గురించి కూడా రేణూ దేశాయ్ మాట్లాడారు. వాళ్ల మనస్థత్వాల గురించి చెప్పుకొచ్చారు. ‘‘ఆధ్య, అకీరా.. ఇద్దరికీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అకీరా చాలా ప్రశాంతంగా ఉంటాడు. యోగా, కలరిపయట్టు లాంటివి చేస్తుంటాడు. ఇప్పటికీ ఈ విషయం వందసార్లు చెప్పాను. ఇప్పటివరకు అకీరాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, హీరో అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ తన ఆలోచన ఎప్పుడు మారితే అప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ విషయం ప్రకటిస్తాను. ప్రేక్షకులు వాళ్లలో వాళ్లు అనుకోవడం మానేయాలి. అకీరా ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. తన అన్నదమ్ముళ్లు, నిర్మాతలు ఎవరూ తనను సినిమాల కోసం సిద్ధం చేయడం లేదు’’ అని చెప్పుకొచ్చారు రేణూ.

మ్యూజిక్ డైరెక్టర్‌కు అసిస్టెంట్‌గా..

‘‘అకీరా నటిస్తే నేనే బ్యాండ్ బాజాతో తను హీరో అవుతున్నాడని ప్రకటిస్తాను. ప్రతీ రెండు నెలలకు తను ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అందరూ నన్ను అడుగుతున్నారు ఏం చెప్పను అని తనను అడిగినా కూడా అమ్మ నేను హీరో అవ్వాలని అనుకోవడం లేదు అంటాడు. భవిష్యత్తులో ఇంట్రెస్ట్ వస్తుందా అంటే భవిష్యత్తు గురించి నాకెలా తెలుస్తుంది అంటాడు. తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పియానో చాలా బాగా ప్లే చేస్తాడు. కొంతకాలం వేరే మ్యూజిక్ డైరెక్టర్లకు అసిస్టెంట్‌గా చేశాడు. ఎక్కువగా హెల్త్ మీద శ్రద్ధ తీసుకుంటాడు. స్మోకింగ్, డ్రింకింగ్ అస్సలు నచ్చదు’’ అంటూ తన కొడుకు గురించి గర్వంగా చెప్పారు రేణూ దేశాయ్.

Also Read: పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై మాజీ భార్య రేణు దేశాయ్‌ ఊహించని కామెంట్స్‌ - గ్లాస్‌ గుర్తు సింబాలిక్‌గా‌ ఆద్య వీడియో..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget