Renu Desai: రేణు దేశాయ్ ఇన్‌స్టా స్టోరీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం - మరి పవన్ కళ్యాణ్? అందుకే అలా చేసిందా?
Renu Desai Instagram: తాజాగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం వీడియోను రేణు దేశాయ్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ వీడియో షేర్ చేయలేదని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు.
Renu Desai Instagram: ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తమ కొడుకు అకిరా లేకుండా ఎక్కడికి వెళ్లడం లేదు. ఎన్నికల ఫలితాలు బయటికొచ్చినప్పటి నుంచి ఆన్నా, పవన్‌తోనే ఉంటున్నాడు అకిరా. అకిరా ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో అంతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు రేణు. తాజాగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఎందుకు షేర్ చేయలేదని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
ఎందుకు మాట్లాడడం లేదు..
‘‘ఈ మాటల కోసం 5 ఏళ్లు ఎదురుచూశాం’’ అంటూ ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు రేణు దేశాయ్. కానీ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో మాత్రం షేర్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పటికే అసలు పవన్ కళ్యాణ్ గురించి ఏమీ మాట్లాడడం లేదు ఎందుకని ఫ్యాన్స్ నుంచి ఆమెకు ప్రశ్న ఎదురయ్యింది. అప్పుడే రేణు క్లారిటీ ఇచ్చారు. ‘‘ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా మాట్లాడితే కావాలనే అటెన్షన్ కోసం చేస్తుందని అంతా అనుకుంటారు’’ అని రేణు క్లారిటీ ఇచ్చింది. అందుకే, చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. అకిరా, ఆద్యాల వీడియోను మాత్రమే పోస్ట్ చేసి ఉంటుందని అనుకుంటున్నారు.
ఫోన్ కాల్..
‘‘నేను ఇప్పుడు ఏమైనా చెప్పడం ప్రారంభిస్తే ఇప్పుడు తనకు తాను అటెన్షన్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తోంది అంటారు. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదంతా ఆయనకు ఫోన్ కాల్ ద్వారా నేరుగా చెప్పేశాను. మీరంతా ఇంక సంతోషంగా ఉండండి’’ అని క్లారిటీ ఇచ్చారు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ వెళ్లిన ప్రతీచోటుకి అకిరా కూడా వెళ్తున్నాడు కాబట్టి అకిరాకు సంబంధించిన ప్రతీ ఫోటోను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉన్నారు రేణు. ఎన్నికల ఫలితాలు రాగానే చంద్రబాబును కలవడానికి వెళ్లారు పవన్. అప్పుడు కూడా అకిరా తన వెంటే ఉన్నాడు. ఇక పవన్, అకిరా కలిసి మోదీని కలవడానికి వెళ్లిన విషయం అయితే చాలా స్పెషల్‌గా పోస్ట్ చేశారు రేణు.
మెగా ఫ్యామిలీతో అకిరా..
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్లలేకపోయినా తన కుమారుడు అకిరా, కూతురు ఆధ్యను మాత్రం అక్కడికి పంపారు రేణు దేశాయ్. మెగా ఫ్యామిలీ అందరితో కలిసి వారు కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా అకిరా, ఆధ్య ఎలా రెడీ అయ్యారో అని వీడియో కాల్ చేసి చూసిన రేణు.. ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు కూడా. ఈ కార్యక్రమం కోసం పంచెకట్టులో రెడీ అయిన అకిరాను చూసి మరోసారి ఫ్యాన్స్ అంతా జూనియర్ పవర్ స్టార్ అనడం మొదలుపెట్టారు. అలా అనడం రేణుకు అస్సలు నచ్చదు. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు కామెంట్స్‌ను పూర్తిగా ఆపేశారు రేణు దేశాయ్.
Also Read: పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అంటూ ఉపాసన ట్వీట్ - పెద్ద చర్చే జరుగుతోందిగా!