Renu Desai: దేవుడు లేడు అత్యాశే ఉంది- వినాయక చవితి సెలెబ్రేషన్స్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం
Renu Desai: వినాయక చవితి మీద రేణు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. స్థాయిని చాటుకోవడం కోసం చేసే సెలబ్రేషన్స్ లో దేవుడు కాదు మనిషి దురాశ, అత్యాశ మాత్రమే కనిపిస్తోంది అన్నారామె.
Renu Desai on Vinayaka Chavathi Celebrations: సోషల్ మీడియాలో రేణూ దేశాయ్(Renu Desai) చేసే పోస్టులు ఎక్కువగా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. ఆమె ఎక్కువగా పెట్స్ కోసం పోస్టులు వేస్తుంటారు. పెట్స్ పరిరక్షణ కోసం ఎక్కువగా పాటు పడుతుంటారు. ఇక మధ్యలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) అభిమానులు చేసే విమర్శలకు కాస్త ఘాటుగానే సమాధానం ఇస్తుంటారు. ఆ మధ్య తన కొడుకు, కూతురి మీద ట్రోలింగ్ చేయడంతో కాస్త సీరియస్ అయ్యారు. తన బిడ్డల జోలికి వస్తే మాత్రం ఊరికే వదిలి పెట్టనంటూ వార్నింగ్ ఇచ్చారు
ఈ మధ్య రేణూ దేశాయ్ విజయవాడ వరదలు, అందులో చిక్కుకున్న పెట్స్, వాటిని సంరక్షించేందుకు కష్టపడుతున్న స్వచ్చంద సంస్థల గురించి మాట్లాడారు. తాను కేవలం ఆర్థిక సాయాన్ని అందించగలనని, ఇప్పుడు తనకు ఆరోగ్యం బాగా లేదని, వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నానని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. ఇక వీలైనంత వరకు అందరూ సాయం చేయండని కోరారు.
రేణూ దేశాయ్ బీజీపీ ఫాలోవర్. హిందుత్వం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అయినా తాజాగా ఆమె వినాయక చవితి సెలెబ్రేషన్స్ మీద చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చకు దారి తీసేలా ఉన్నాయి. మామూలుగా అయితే వినాయక చవితి పండుగను రాను రాను దేవుడి స్థాయిని దిగజార్చేలా సెలెబ్రేట్ చేస్తున్నారు. హీరో హీరోయిన్ల గెటప్పుల్లో వినాయకుడి విగ్రహాలను పెడుతున్నారు.. గణేషుడి మండపంలోనే ఐటం సాంగ్‌లు పెడుతున్నారు.. ఎవరు పెద్ద వినాయకుడ్ని పెడితే వారే గొప్ప అన్నట్టుగా తమ స్థాయిని ప్రదర్శించేలా సెలెబ్రేషన్స్ చేస్తున్నారు.
అలాంటి సెలెబ్రేషన్స్ మీద రేణూ దేశాయ్ మండిపడ్డారు. ఇప్పుడు అందరూ కూడా స్థాయిని చాటుకోవడం కోసం.. పెద్ద పెద్ద విగ్రహాలు, ఎక్కువ డెకరేషన్ అంటూ సెలెబ్రేన్స్ చేస్తున్నారు.. నిజానికి అందులో దేవుడు లేడు.. మనిషి దురాశ.. అత్యాశ మాత్రమే ఉంది అంటూ రేణూ దేశాయ్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట్లో ఎలాంటి చర్చలు జరుగుతాయో చూడాలి.
పవన్ కళ్యాణ్ అభిమానులు రేణూ దేశాయ్ మీద చేసే కామెంట్లు.. ఆమె ఇచ్చే రిప్లైలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ వదిన అంటూ ఆమెను సంభోదిస్తూనే ఉంటారు. నన్ను వదిన అని పిలిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ పవన్ కళ్యాణ్‌ను అన్న అని పిలిచి.. తనను వదిన అని మాత్రం పిలవొద్దని చెబుతుంటారు. ఇక అకిరా ఎంట్రీ గురించి ఎప్పుడూ అభిమానులు అడుగుతుంటారు. టైం వస్తే తానే చెబుతానని, అకిరాకు ఇప్పటికైతే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెబుతుంటారు. ఆ మధ్య ప్రధాని మోదీతో తన పిల్లలు భేటీ అయినప్పుడు రేణూ దేశాయ్ చాలా సంతోషించారు.