అన్వేషించండి

Thangalaan Release Date: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న విక్రమ్ - 'తంగలాన్' థియేటర్స్ లోకి వచ్చేది అప్పుడే?

కోలీవుడ్ అగ్ర హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న 'తంగలాన్' మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే అందరూ చెప్పేది చియాన్ విక్రమ్ గురించే. ఆయన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. సినిమా కోసం ఏ హీరో చేయని సాహసాలను చేసి మెప్పు పొందారు. అలాంటి కోలీవుడ్ స్టార్ విక్రమ్ ఇప్పుడు మరోసారి 'తంగలాన్'(Thangalaan) అనే సినిమాతో సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ 2 తో భారీ హిట్ అందుకున్నాడు చియాన్ విక్రమ్. మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆదిత్య కరికాలన్ పాత్రలో తన నటనతో అదరగొట్టాడు. ఇక ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తంగలాన్'.

రజనీకాంత్ తో 'కబాలి', 'కాలా' వంటి సినిమాలను తెరకెక్కించిన పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం విక్రమ్ భారీగా బరువు తగ్గారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ లో విక్రమ్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. అంతలా ఈ సినిమాకి మేకవర్ అయ్యారు ఈ తమిళ హీరో. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలకు తేదిని శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటించనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

చెప్పినట్టుగానే మేకర్స్ 'తంగలాన్' రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ లో విక్రమ్ ఏమాత్రం గుర్తుపట్టని లుక్ లో కనిపించి ఆసక్తిని పెంచారు. కేవలం రిలీజ్ డేట్ మాత్రమే కాకుండా టీజర్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. నవంబర్ 1వ తేదీన 'తంగలాన్' టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు అదే పోస్టర్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.  కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో స్థానికంగా ఉంటున్న వారికి ఆక్రమ దారులకు మధ్య జరిగే గొడవగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇందులో విక్రమ్ సరసన మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2D తో పాటు 3డ్ ఫార్మాట్ లోనూ విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే తంగలాన్ టీజర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ మాట్లాడుతూ..' టీజర్ మరో రేంజ్ లో ఉందని, చూసిన వాళ్లకి గూస్ బంప్స్ వస్తాయని' అన్నారు. అలాగే సినిమా గురించి నిర్మాత ఇటీవల ఓ మీడియా హౌస్ తో మాట్లాడుతూ..' తంగలాన్ ప్రాజెక్టు ప్రొడక్షన్ హౌస్ కి, డైరెక్టర్ కి మాత్రమే కాదు విక్రమ్ కి కూడా ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని' అన్నారు. కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. సెల్వా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Also Read : రష్మికా మందన్న కాళ్ళు పట్టుకున్న రణబీర్ కపూర్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget