Saripodha Sanivaaram : నాని అదిరిపోయే యాక్షన్ - 'సరిపోదా శనివారం' నుంచి ఈ అప్‌డేట్ ఊహించి ఉండరు
Saripodha Sanivaaram Movie : వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న 'సరిపోదా శనివారం' మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో మొదలైంది. యాక్షన్ ఎపిసోడ్ తో షూటింగ్ స్టార్ట్ చేశారు.
Nani's Saripodha Sanivaaram shooting : 'దసరా'(Dasara) మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాని నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'(Hi Nanna) విడుదలకు ముస్తాబవుతోంది. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీ తండ్రి, కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా సాగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఈ మూవీ రిలీజ్ కాకముందే మరో సినిమాకి కమిట్ అయ్యాడు నాని. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' ( Saripodha Sanivaaram ) అనే సినిమాలో నాని నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టైటిల్ తో పాటు గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ లో నాని యాక్షన్ అవతార్ లో అదరగొట్టేసాడు. గత నెలలోనే ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ని అందించారు. తాజాగా 'సరిపోదా శనివారం' మూవీ రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ యాక్షన్ ఎపిసోడ్ తో షూటింగ్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. హైదరాబాదులో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
We started the shoot of #SaripodhaaSanivaaram today with an action episode 🔥🔥 pic.twitter.com/wqi6wyK4Rw
— DVV Entertainment (@DVVMovies) November 13, 2023
స్టంట్ కొరియోగ్రాఫర్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ల పర్యవేక్షణలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్ ని కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. నానితో పాటు సినిమాలోని ప్రధాన తారాగణం ఈ షూటింగ్లో భాగం కానున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ ( DVV Entertainments) బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీళ్ళిద్దరి కలయికలో 'గ్యాంగ్ లీడర్'(Gang Leader) అనే మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమా ఆకట్టుకోకపోయినా సినిమాలో నాని, ప్రియాంక మోహన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కలయికలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ అగ్ర నటుడు సూర్య విలన్ గా కనిపించనున్న ఈ మూవీ కోసం ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జేక్స్ బిజొయ్ సంగీతం అందిస్తుండగా, మురళి. జి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే నాని ఇప్పటికే వివేక ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే సుందరానికి'(Ante Sundaraniki) అనే సినిమాలో నటించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా నానికి మంచి హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ డిఫరెంట్ జోనర్ తో 'సరిపోదా శనివారం' మూవీని తెరకెక్కిస్తున్నాడు వివేక్ ఆత్రేయ. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
Also Read : అట్లీ మల్టీస్టారర్ స్క్రిప్ట్ వర్క్ షురూ, టార్గెట్ వింటే షాక్ అవ్వాల్సిందే!