జెట్ స్పీడ్‌లో ముస్తాబవుతున్న'సైంధవ్' - మరో కీలక అప్‌డేట్!
విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'సైంధవ్' తాజాగా మరో కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కెరియర్ లో 75వ ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కుతోంది 'సైంధవ్'. టాలెంటెడ్ యంగ్ ఫిలిం మేకర్, హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వెంకటేష్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న మూవీ యూనిట్ తాజాగా మరో కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. హీరో వెంకటేష్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ మరియు ఇతర తారాగణం సెట్స్ లో ఉన్న ఓ వీడియోని ఈ సందర్భంగా పంచుకున్నారు. అలాగే నెక్స్ట్ ఫైనల్ మిషన్ వైపు దూసుకుపోతున్నట్లు తెలియజేశారు.
హీరోయిన్ రుహాని శర్మ తన ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియోని పోస్ట్ చేసింది. అంతేకాకుండా సైంధవ్ టీం మరో షెడ్యూల్ ని కంప్లీట్ చేసిందని, ఇక నెక్స్ట్ ఫైనల్ మెషిన్ కి వెళ్తుంది' అంటూ రాస్కొచ్చింది. కాగా ఈ సినిమాలో భారీ తారాగణం కనిపిస్తోంది. వెంకటేష్ తో పాటు బాలీవుడ్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ సినిమాతో తెలుగు వెండితెరకు అరంగేట్రం చేస్తున్నారు. అలాగే వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుండగా రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో మనోజ్ఞ అనే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుండగా.. డాక్టర్ రేణు పాత్రలో రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన వీళ్ళ పోస్ట్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. రీసెంట్ గా 'హిట్2' తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న శైలేష్ కొలను వెంకటేష్ తో సినిమా అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. మాఫియా, డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగనుంది.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కిషోర్ తాళ్లూరు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ మణికంధన్ కెమెరామెన్ గా, గ్యారీ బీహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కెరియర్ లో మొట్టమొదటి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తెలుగులో తోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా విక్టరీ వెంకటేష్ ఈమధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటించడం మొదలు పెట్టేసారు. రీసెంట్ గా దగ్గుబాటి రానాతో కలిసి ఆయన నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ భారీ స్పందనను కనబరిచింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ పలు వివాదాలు కూడా ఎదుర్కొంది. అయినా కూడా ఈ వెబ్ సిరీస్ కి ఓరేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. త్వరలో 'రానా నాయుడు' సీజన్ 2 కూడా రాబోతోంది.
Schedule wrap ! Onto planning the next sched. Stay tuned for some mad updates from here on :) #SaindhavOnDec22 ❤️🔥
— Sailesh Kolanu (@KolanuSailesh) June 28, 2023
Victory @VenkyMama @Nawazuddin_S @iRuhaniSharma @ShraddhaSrinath @andrea_jeremiah @Music_Santhosh @vboyanapalli @NiharikaEnt @maniDop pic.twitter.com/7sXWA1c3ns
Read Also : 'ఆదిపురుష్' పని అయిపోయినట్టేనా? ఇంత తక్కువ కలెక్షన్లా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial